Today Rasi Phalalu: ఈ రాశివారికి స్నేహితుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి!

Published : Jul 31, 2025, 05:00 AM IST

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 31.07.2025 గురువారానికి సంబంధించినవి.

PREV
112
మేష రాశి ఫలాలు

అనారోగ్య సమస్యలు నుంచి ఉపశమనం పొందుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు రాణిస్తాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఇంట్లో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

212
వృషభ రాశి ఫలాలు

ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి.

312
మిథున రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. 

412
కర్కాటక రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు. కుటుంబ విషయాల్లో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

512
సింహ రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. గృహనిర్మాణ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఉద్యోగాల్లో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

612
కన్య రాశి ఫలాలు

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో మరింత రాణిస్తారు.

712
తుల రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి గొడవలు జరుగుతాయి. ఇంటాబయట కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. బంధువర్గం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

812
వృశ్చిక రాశి ఫలాలు

ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అవసరానికి డబ్బు సహాయం లభిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చికాకు తెప్పిస్తాయి.

912
ధనుస్సు రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

1012
మకర రాశి ఫలాలు

స్నేహితులతో మాటపట్టింపులు ఉంటాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందికొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది.

1112
కుంభ రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో శ్రమ తప్పదు. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

1212
మీన రాశి ఫలాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. డబ్బు పరంగా చికాకులు తొలగిపోతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటి నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు అనుకూలం. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories