ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడంటే..
2025లో చివరి సూర్య గ్రహణం 21 సెప్టెంబర్ 25వ తేదీన ఏర్పడనుంది. ఈ గ్రహణ ప్రభావం ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణ ఫసిపిక్ మహా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. అయితే, ఈ గ్రహణం భారత్ లో కనిపించదు. కానీ, దాని జోతిష్య ప్రభావాలు మాత్రం కొన్ని రాశులపై చూపించనుంది. మరి, ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపించనుందో తెలుసుకుందాం...
గ్రహణం ఎలా ఎర్పడుతుందో తెలుసా?
చంద్రుడు.. భూమి, సూర్యుడి మధ్యలోకి వచ్చి ఆ సూర్య కాంతిని అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. చంద్రుడు సూర్యుడికి, భూమికి అడ్డు వచ్చినప్పుడు చీకటిగా అనిపిస్తుంది. దీనినే సూర్యగ్రహణం అంటారు.
ఈ గ్రహణం ఏ రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది?
సెప్టెంబర్ 21, 2025 న సంభవించే సూర్యగ్రహణం కన్య రాశి , ఉత్తర ఫాల్గుణ నక్షత్రంలో సంభవిస్తుంది. కాబట్టి, దీని ప్రభావం ముఖ్యంగా కన్య రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, మిథునం, మీనం, ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.