
ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశివారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో శారీరక శ్రమ అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో సందడిగా గడుపుతారు. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నిరుద్యోగులు చిన్న ప్రయత్నంతో మంచి అవకాశాలు పొందుతారు.
వృషభ రాశివారికి ఈ మాసం ప్రారంభంలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన అన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు పొందుతారు. మాసం మధ్య నుంచి దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో చీటికిమాటికి వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. గృహ నిర్మాణ యత్నాలలో ఊహించని అవరోధాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
మిథున రాశివారికి ఈ మాసం మరింత అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. కొన్ని సమస్యలను స్నేహితుల చొరవతో పరిష్కరించుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతాన విద్యా విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను అధికారుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. నెలాఖరులో జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.
కర్కాటక రాశివారికి ఈ నెల గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న పదవులు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.
ఈ మాసం సింహ రాశివారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఎంతటి వారినైనా మీ మాట మీదకి తీసుకొస్తారు. శత్రు పరమైన సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అన్ని రంగాల వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. మాసం చివరన దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
కన్య రాశివారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మాసం మొదటి భాగంలో చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. నెల మధ్య నుంచి పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి.
తుల రాశివారికి ఈ మాసం ప్రతికూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో పెద్దల సలహాలతో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు మరొకసారి నిరాశ తప్పదు. కొన్ని విషయాలలో తొందరపాటు వల్ల ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి.
వృశ్చిక రాశివారికి ఈ మాసం మొదటి భాగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్న అవసరానికి ధన సహాయం అందుతుంది. మాసం మధ్య నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ధనుస్సు రాశివారికి ఈ మాసం అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం తగినంత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మకర రాశివారికి మాసం మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలిగినప్పటికీ కొంత నిదానంగా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంతాన పరంగా శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలం. వృత్తి, వ్యాపారాలలో చివరి నిమిషాల్లో నిర్ణయాల మార్పు వల్ల లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
కుంభ రాశివారికి ఈ మాసం అంతగా అనుకూలంగా ఉండదు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. వృత్తి, వ్యాపారాలు అంతగా రాణించవు. ఆర్థికంగా మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చుట్టుపక్కల వారితో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణ యత్నాలు వాయిదా వేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.
మీన రాశివారికి ఈ మాసం అంతగా అనుకూలించదు. వృత్తి, వ్యాపారాలు అంతంగా కలిసిరావు. ఆర్థికంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపార విషయాలలో ప్రభుత్వ సంబంధిత జరిమానాలు కట్టాల్సి రావచ్చు. ఇంటా బయటా కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.