మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరుల నుంచి డబ్బు సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.