Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. అప్పుల నుంచి విముక్తి!

Published : Feb 28, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 28.02.2026 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

313
వృషభ రాశి ఫలాలు

కుటుంబ విషయాలలో చిక్కులు తప్పవు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ఖర్చులు అదుపు చేయడం మంచిది. పనులు నిదానంగా పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది.

413
మిథున రాశి ఫలాలు

అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి, సమాజంలో ఆదరణ పెరుగుతుంది. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అప్పుల నుంచి ఊరట లభిస్తుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన రుణాలు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలించవు. ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి.

613
సింహ రాశి ఫలాలు

చేపట్టిన పనులలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

713
కన్య రాశి ఫలాలు

తండ్రి తరుపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

813
తుల రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు మారుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. స్థిరాస్తి వివాదాలు తప్పవు. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో అదనపు పని భారం వల్ల శ్రమ కలుగుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు

వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. నూతన రుణాలు చేయాల్సి రావచ్చు. కావాల్సిన వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. విందు వినోదాది కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొన్ని ఆలోచనలు కలిసివస్తాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

1113
మకర రాశి ఫలాలు

దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రాధాన్యం పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలిసివస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి.

1213
కుంభ రాశి ఫలాలు

కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగాలలో విమర్శలు పెరుగుతాయి.

1313
మీన రాశి ఫలాలు

ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. రుణ ప్రయత్నాలు కలిసిరావు. దూరపు బంధువుల నుంచి ఒక వార్త విచారం కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories