Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చేయని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుంది!

Published : Jan 26, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 26.01.2025 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఇంటా బయటా అనుకూలం. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. దైవానుగ్రహంతో ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

313
వృషభ రాశి ఫలాలు

శారీరక, మానసిక సమస్యలు ఉంటాయి. ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తికాక ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురికావల్సి వస్తుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. 

413
మిథున రాశి ఫలాలు

నూతన వస్తు, వాహనాలు బహుమతులుగా పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగులకు అనుకూలం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.

613
సింహ రాశి ఫలాలు

ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

713
కన్య రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పాత మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

813
తుల రాశి ఫలాలు

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. వ్యాపారాలు లాభిస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇతరుల వల్ల కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అకారణంగా కుటుంబ సభ్యులతో వివాదాలు వస్తాయి. కంటి సంబంధిత సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు చికాకు తెప్పిస్తాయి. 

1013
ధనుస్సు రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం.

1113
మకర రాశి ఫలాలు

చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. బంధువుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగాలలో చేయని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

1213
కుంభ రాశి ఫలాలు

బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో ఆత్మ విశ్వాసంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories