Sun in february: సూర్యుడు త్రిగుణసంచారంతో ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం వచ్చే ఛాన్స్

Published : Jan 25, 2026, 10:43 AM IST

Sun in february: ఫిబ్రవరిలో సూర్యుడు త్రిగుణ సంచారం చేయబోతున్నాడు. అంటే ఫిబ్రవరి నెలలో ఒకేసారి మూడుసార్లు తన రాశిని లేదా నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. 

PREV
14
సూర్యుడి త్రిగుణ సంచారం

సూర్య సంచారం అనేది రాశి చక్రంపై చాలా ప్రభావం పడుతుంది. గ్రహాలకు రాజు సూర్యుడు. ప్రతినెలా రాశి చక్రాలను మారుస్తూనే ఉంటాడు. ప్రస్తుతం మకర రాశిలో ఉన్నాడు సూర్యుడు. ఫిబ్రవరి లో ఒకసారి రాశిని రెండుసార్లు నక్షత్రాలను మారబోతున్నాడు. ఈ త్రిగుణ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. సూర్యుడు ఫిబ్రవరి 6న ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 13న కుంభ రాశిలోకి అడుగుపెడతాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 19న శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని ఈ మూడు సంచారాలు మూడు రాశులకు విపరీతంగా శుభ ఫలితాలను అందిస్తాయి.

24
వృషభ రాశి

సూర్యుని సంచారం వృషభరాశి వారికి ఎంతగానో కలిసి వస్తుంది. ముఖ్యంగా కెరీర్లో మంచి పురోగతిని అందిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం. వారి నిరీక్షణకు ఒక ముగింపు వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీవితంలో పెరుగుదల వంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఇక వ్యాపారం చేసేవారు మంచి లాభాలను చూస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.

34
ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ఫిబ్రవరిలో చేసే ఈ సూర్య సంచారం సానుకూల ఫలితాలను అందిస్తుంది. వీరిలో శక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. వీరికి అదృష్టం అనుకూలంగా మారుతుంది. ఏ పని చేపట్టినా అది త్వరగా పూర్తి అవుతుంది. కొంతమంది రిస్కు తీసుకొని మరి మంచి ఫలితాలను పొందుతారు మీరు అనుబంధం పెరుగుతాయి.

44
కుంభ రాశి

సూర్యుడు కుంభరాశిలో ఫిబ్రవరిలో అడుగుపెడతాడు. కుంభ రాశి శనికి చెందిన రాశి. ఈ రాశిలో జన్మించిన వారికి సూర్యుడు ఎన్నో ప్రయోజనాలను అందివ్వబోతున్నాడు. వీరికి అకస్మాత్తుగా ఎక్కడి నుంచైనా డబ్బు చేతికే అందవచ్చు. అలాగే వీరి హోదా, గౌరవం కూడా పెరుగుతుంది. వీరిలో ఆత్మవిశ్వాసం బలంగా మారుతుంది. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు పొందుతారు. వివాదాస్పద కేసులను విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరుకున్న దీర్ఘకాలిక వ్యాధులను కలిగే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories