వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.