Weekly Horoscope: ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసా..?

Published : Oct 12, 2025, 08:07 AM IST

Weekly Horoscope: ఈ వార ఫలాలు 12.10.2025 నుంచి 18.10.2025 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం కలుగుతుంది. వారాంతంలో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

313
వృషభ రాశి ఫలాలు

బంధు మిత్రులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో స్నేహితుల సలహాలు కలిసివస్తాయి. భూ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. వాహన యోగం ఉంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు పొందుతారు. ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

413
మిథున రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు టైంకి పూర్తిచేస్తారు. మొండి బాకీలు కొంతవరకు వసూలవుతాయి. పాత మిత్రులను కలుసుకొని కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. సంతానం విద్యా విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఊహించని లాభాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వారాంతంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. 

513
కర్కాటక రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 

613
సింహ రాశి ఫలాలు

కొత్త పరిచయాలు లాభిస్తాయి. దూరప్రాంత బంధువుల నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసివస్తాయి. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు లభిస్తాయి. వారం మధ్య నుంచి కుటుంబ సభ్యులు మీ ఆలోచనలతో విభేదిస్తారు.

713
కన్య రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. సన్నిహితులతో దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వారాంతంలో ఖర్చులు పెరుగుతాయి.

813
తుల రాశి ఫలాలు

ప్రయాణాలలో ఏర్పడిన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. మొండిబాకీలు వసూలవుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. గృహ నిర్మాణానికి ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. భూ క్రయ విక్రయాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. 

913
వృశ్చిక రాశి ఫలాలు

వాహన యోగం ఉంది. కొన్ని వ్యవహారాల్లో మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వారితో ఉన్న పరిచయాలు వల్ల కొన్ని వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. వారాంతంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. డబ్బు విషయంలో ఇతరులకు మధ్య వర్తిత్వం చేయడం మంచిదికాదు. 

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. దాయాదులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. పాత మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకం. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. వారం చివరన జీవిత భాగస్వామితో వివాదాలు వస్తాయి.  

1113
మకర రాశి ఫలాలు

ఆదాయ మార్గాలు తగ్గుతాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. ఆలోచనల్లో స్థిరత్వం లోపిస్తుంది. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు దక్కవు. వారాంతంలో ధన లాభాలుంటాయి.

1213
కుంభ రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో నూతనోత్సాహంతో పనిచేసి లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థికంగా కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విహారయాత్రలో పాల్గొంటారు. ఇతరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. వారం మధ్యలో కొన్ని పనుల్లో శ్రమ పెరుగుతుంది. ప్రయాణాలు అంతగా కలిసిరావు.

1313
మీన రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అంచనాలు అందుకుంటారు. ఇతరుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలం. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories