వృషభ రాశి...
శుక్రుడు కన్య రాశిలోకి అడుగుపెట్టడం వృషభ రాశి వారికి చాలా మేలు జరగనుంది. మీరు ఏదైనా పనిని జాగ్రత్తగా చేస్తే, మీరు సరైన విజయాన్ని సాధించగలరు. ప్రేమ , వైవాహిక జీవితానికి సంబంధించి.. శుభవార్తలు వింటారు. మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. పిల్లల ద్వారా మీకు సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. మీరు కష్టపడి పనిచేస్తే, మీరు సులభంగా విజయం సాధించగలరు. ఈ కాలం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆన్‌లైన్ లావాదేవీలు , డబ్బు సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.