Today Rasi Phalalu: ఈ రాశివారు స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు!

Published : Jul 11, 2025, 05:00 AM IST

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 11.07.2025 శుక్రవారానికి సంబంధించినవి.

PREV
112
మేష రాశి ఫలాలు

సమాజంలో ప్రముఖులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు.

212
వృషభ రాశి ఫలాలు

బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రు సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త అవకాశాలు అందుకుంటారు.

312
మిథున రాశి ఫలాలు

ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాల్లో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.

412
కర్కాటక రాశి ఫలాలు

ఇంటా బయట అదనపు బాధ్యతల వల్ల చికాకు పెరుగుతుంది. మానసిక సమస్యలు బాధిస్తాయి. కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. బంధు మిత్రులతో స్పల్ప మాట పట్టింపులుంటాయి. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.

512
సింహ రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నివైపుల నుంచి ఆదాయం అందుతుంది. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాల్లో ఏర్పడిన కొత్త వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన విధంగా ఉంటాయి. ఆర్థికంగా అనుకూలం.  

612
కన్య రాశి ఫలాలు

అవసరానికి మించి ఖర్చు చేస్తారు. కీలక విషయాల్లో ద్విస్వభావ ఆలోచనలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

712
తుల రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. స్నేహితుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

812
వృశ్చిక రాశి ఫలాలు

ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థికంగా లోటుపాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

912
ధనుస్సు రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. కొన్ని ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

1012
మకర రాశి ఫలాలు

డబ్బు పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

1112
కుంభ రాశి ఫలాలు

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంట్లో కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బంది పడతారు. వ్యాపారంలో ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.

1212
మీన రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాల్లో శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. వాహన ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు.

Read more Photos on
click me!

Recommended Stories