న్యూమరాలజీ మన జీవితాలను చాలా ఎక్కువగానే ప్రభావితం చేస్తుంది. మనం పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని మన వ్యక్తిత్వం, మన భవిష్యత్తు అన్నింటినీ ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ రోజు నాలుగు ముఖ్యమైన తేదీల్లో పుట్టిన వారు జీవితంలో అనుకున్న విజయాన్ని సాధించగలరు.అది కూడా చిన్న వయసులోనే మంచి స్థాయికి చేరుకుంటారు. మరి, ఆ తేదీలేంటో తెలుసుకుందామా...
25
నెంబర్ 4...
ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారంతా సహజంగా అదృష్టవంతులు. చిన్న వయసులోనే వారు సులభంగా విజయం సాధించగలరు. వారు ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని చాలా సులభంగా చేరుకుంటారు. అలాంటి సత్తా వీరిలో ఉంటుంది.
35
ఈ తేదీల్లో పుట్టిన వారి ప్రత్యేకత ఏంటి?
ఈ నెంబర్ 4 కి చెందిన వ్యక్తులకు డబ్బులను ఎలా మేనేజ్ చేయాలి అనే విషయం బాగా తెలుసు. డబ్బు ఎలా సంపాదించాలి? ఎక్కడ ఖర్చు చేయాలి? ఎక్కడ ఆదా చేయాలి అనే విషయంలో వీరికి ఒక క్లారిటీ ఉంటుంది. అందుకే చిన్నతనంలోనే కోటీశ్వరులు అవ్వగల సత్తా వీరిలో ఉంటుంది. వీరు సంపాదించిన డబ్బుతో చాలా సంతోషంగా జీవించగలరు.
కేవలం అదృష్టం ఉండటం వల్ల మాత్రమే వీరు జీవితంలో సక్సెస్ అవుతారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. వీరికి జీవితం పట్ల ఒక లక్ష్యం ఉంటుంది. దాని కోసం కృషి చేస్తారు. తెలియని విషయాల గురించి తెలుసుకుంటారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళతారు. అందుకే.. చాలా తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని చేరుకుంటారు. తమ తెలివితేటలతో విజయానికి నిచ్చెన వేసుకుంటారు.
55
కెరీర్..
ఈ తేదీల్లో జన్మించిన వారు ఇంజనీర్, డిజైనర్, న్యాయవాది , శాస్త్రవేత్త వంటి వృత్తులను ఎంచుకోవడం ద్వారా గొప్ప విజయాన్ని సాధిస్తారు. వారు ఈ రంగంలోకి వెళితే, వారు చాలా త్వరగా విజయం సాధిస్తారు. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మంచి నాయకుడు అయ్యే అవకాశం కూడా ఉంది.