Today Rasi Phalalu: నేడు ఓ రాశి వారికి అప్పుల నుంచి విముక్తి దక్కుతుంది!

Published : Aug 10, 2025, 05:00 AM IST

ఈ రాశి ఫలాలు 10.08.2025 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు. వృత్తి, వ్యాపారాల్లో ఇతరులతో విభేదాలు వస్తాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది.

313
వృషభ రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు కలిసివస్తాయి. అప్పులు తీరుతాయి. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి సహాయం అందుతుంది.

413
మిథున రాశి ఫలాలు

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాల వల్ల విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. 

613
సింహ రాశి ఫలాలు

ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో విందువినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులను కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.

713
కన్య రాశి ఫలాలు

బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

813
తుల రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి.

913
వృశ్చిక రాశి ఫలాలు

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 

1113
మకర రాశి ఫలాలు

నూతన వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి.

1213
కుంభ రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దాయదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో మానసిక సమస్యలు తప్పవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగులు జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం దక్కతుంది.

Read more Photos on
click me!

Recommended Stories