జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరచూ మారుతూ ఉంటాయి. ఒక్కో గ్రహానికి ఒక్కో కాల పరిమితి ఉంటుంది. వాటి ప్రకారం అవి రాశులను మార్చుకుంటూ ఉంటాయి. ఒక్కోసారి గ్రహాలు అనుకోకుండా.. ఒకే రాశిలోకి అడుగుపెడతాయి. ఇలా రెండు, మూడు గ్రహాల కలయిక కారణంగా యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. త్వరలో బుధ, శక్ర గ్రహాలు ఒకే రాశిలో కలవనున్నాయి.
జోతిష్యశాస్త్రంలో బుధుడుని గ్రహాలకు అధిపతిగా, శుక్రుడిని అత్యంత శుభ ప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడు శుభస్థానంలో ఉన్నప్పుడు విలాసవంతమైన జీవితం, ఆనందం లభిస్తాయి. బుధుడు జాతకంలో అనుకూలంగా ఉన్నప్పుడు ఉద్యోగాల్లో పురోగతి, వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. ఈ రెండు గ్రహాలు శుభ స్థానంలో కలిస్తే.. అదృష్టం, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. ఈ అరుదైన కలయిక ఆగస్టు 21న ఏర్పడనుంది. బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో సంచరించనున్నాయి. దీని వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. మరి, ఈ సంచారం ఏయే రాశులకు లాభం కలిగించనుందో తెలుసుకుందామా...