Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు స్త్రీ సంబంధ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి!

Published : Apr 01, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 01.04.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. డబ్బు వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు వృథాగా మిగులుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలం. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అన్నదమ్ముల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు చక్కగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు.

413
మిథున రాశి ఫలాలు

పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయటా చికాకులు అధికమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. స్త్రీ సంబంధ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

513
కర్కాటక రాశి ఫలాలు

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు.

613
సింహ రాశి ఫలాలు

ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో కొత్త సమస్యలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

713
కన్య రాశి ఫలాలు

సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. అన్ని విషయాలలో బంధు మిత్రుల సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది.

813
తుల రాశి ఫలాలు

ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వల్ల మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

సంతాన విద్యా విషయాలు సమస్యాత్మకంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులను అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

1113
మకర రాశి ఫలాలు

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.

1213
కుంభ రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం విషయంలో లోటుపాట్లు అధిగమిస్తారు. వ్యాపారాలలో శత్రు సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

1313
మీన రాశి ఫలాలు

నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

Read more Photos on
click me!

Recommended Stories