Shani Dosham: శని దోషంతో బాధపడుతున్నారా? ఈ 5 పనులు చేస్తే మీ సమస్యలు తీరడం పక్కా!

Published : Mar 31, 2026, 03:31 PM ISTUpdated : Mar 31, 2026, 03:34 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శని వ్యయ స్థానంలో ఉంటే జీవితంలో ఆటంకాలు, అనవసర ఖర్చులు పెరుగుతాయి. కానీ సులభమైన పరిహారాలతో శని దోష ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. నష్టాలను లాభాలుగా మార్చుకోవచ్చు. మరి శని దోష నివారణకు ఏం చేయాలో చూద్దామా..

PREV
17
శని దోషం పోవాలంటే ఏం చేయాలి?

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శని కదలికలు, రాశిమార్పులు, నక్షత్ర మార్పులు వ్యక్తుల జీవితాలపై మంచి, చెడు ప్రభావాలను చూపిస్తాయి. ముఖ్యంగా శని సంచారం, శని దోషం అంటే చాలామంది భయపడుతారు. శని దోషం ఉన్నవారికి పనుల్లో ఆలస్యం, ఆటంకాలు, మానసిక ఒత్తిడి వంటివి ఎదురవుతుంటాయి. అయితే సరైన పరిహారాలు పాటిస్తే శని దేవుడు గొప్ప లాభాలను, స్థిరమైన విజయాన్ని అందిస్తాడని పండితులు చెబుతున్నారు. మరి శని దోష నివారణకు ఏం చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

27
వ్యయ శని అంటే ఏంటి?

ఒక వ్యక్తి జాతకంలో శని 12వ ఇంట్లో లేదా వ్యయ స్థానంలో ఉంటే దాన్ని 'వ్యయ శని' అంటారు. దీనివల్ల అనవసర ఖర్చులు, అప్పుల భారం, మానసిక వేదన, పనుల్లో ఆటంకాలు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కానీ దీన్ని సరిగ్గా ఎదుర్కొంటే, ఈ నష్టాలే పెట్టుబడులుగా మారి లాభాలను తెచ్చిపెడతాయని పండితులు చెబుతున్నారు.

37
శనివారం పూజ

న్యాయదేవుడైన శనీశ్వరుడు కరుణిస్తే కొండంత అండగా నిలుస్తాడని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ప్రతి శనివారం శనీశ్వరుడిని పూజించడం చాలా ముఖ్యం. నువ్వుల నూనెతో దీపం వెలిగించి, 'ఓం శనైశ్చరాయ నమః' అని 108 సార్లు జపిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి.

నువ్వులు, నల్లని వస్తువుల దానం

అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా పేదలకు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, ఇనుప వస్తువులు దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.

47
ఆంజనేయ స్వామి ఆరాధన

పండితుల ప్రకారం, శని దోషం తగ్గాలంటే ఆంజనేయ స్వామిని పూజించడం ఉత్తమ పరిహారం. ముఖ్యంగా శనివారాల్లో 'హనుమాన్ చాలీసా' పారాయణం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. దగ్గర్లోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేయడం వల్ల వ్యయ శని ప్రభావం తగ్గి, లాభాలు, సంతోషం పెరుగుతాయి.

కష్టంలో ఉన్నవారికి సహాయం

శని కష్టపడి పనిచేసే తత్వాన్ని సూచిస్తాడు. కాబట్టి కూలీ పనులు చేసుకునే పేదలు, వృద్ధులు వంటి వారికి సహాయం చేస్తే శని దేవుడి కరుణ పెరుగుతుంది. పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం వంటివి కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.

57
ధర్మబద్ధమైన జీవన విధానం

అబద్ధాలు చెప్పకుండా, నిజాయతీగా జీవించడం శని దేవుడి అనుగ్రహం పొందడానికి చాలా ముఖ్యం. తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బు శని ఆగ్రహాన్ని పెంచుతుంది. అలాగే, మంచి ఆలోచనలు, నిరంతర ప్రయత్నం  ఆరోగ్యకరమైన ఎదుగుదలను అందిస్తాయి.

67
వ్యయ శనిని లాభ శనిగా మార్చడం ఎలా?

పండితుల ప్రకారం వ్యయ శని ప్రభావం ఉన్నవారు తమ ఖర్చులను నియంత్రించుకొని, పొదుపు అలవాటును పెంచుకోవాలి. అదే సమయంలో ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. శని ఇచ్చే కష్టాలు మనల్ని పరీక్షించడానికే. వాటిని దాటితే గొప్ప విజయం ఖాయం.

77
భయం అవసరం లేదు

శని దోషం అనగానే భయపడాల్సిన అవసరం లేదు. అది మనల్ని క్రమశిక్షణతో, ఓర్పుతో ఉండేలా చేసే ఒక జీవిత గురువు లాంటిది. సరైన పరిహారాలు, మంచి పనులు చేస్తే వ్యయ శని కూడా లాభ శనిగా మారి జీవితంలో స్థిరమైన పురోగతిని ఇస్తుందని పండితులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories