Chanakya Niti: సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని షేర్ చేయడం నేడు ట్రెండ్ గా మారింది. అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ప్రతి ఆలోచను, ప్రతి అనుభూతిని వెల్లడించడం సరికాదని, కొన్ని విషయాలను రహస్యంగా ఉంచాలని సూచించారు. ఇంతకీ ఆ విషయాలేంటీ?
ప్రతి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయకుండా .. కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడం ఎంతో మేలు. కొన్ని విషయాలు బయటపెడితే వ్యక్తిగత సంబంధాలు, వృత్తిపరమైన అవకాశాలు, భద్రత వంటి విషయంలో సమస్యలు రావచ్చు. ఏ విషయాన్ని చెప్పాలి? ఏ విషయాన్ని రహస్యంగా ఉంచాలి? అనేది ఆలోచించి నిర్ణయించుకోవడమే తెలివైన వారి లక్షణమని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నారు.
25
వారే తెలివైనవారు
ఈ రోజుల్లో చాలామందికి సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని షేర్ చేయడం అలవాటుగా మారింది. వ్యక్తిగత విషయాలు, భావోద్వేగాలు, ప్రయాణాలు, ఆర్థిక విషయాలు అన్నింటినీ బహిరంగంగా సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు. అలాంటి విషయాలు చెప్పే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించాలనీ, కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే తెలివైన వారి లక్షణమని ఆచార్య చాణక్యుడు సూచించారు.
35
ప్రేమలో గోప్యత
ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన భావోద్వేగం. అది బలపడే వరకూ దాన్ని రహస్యంగా ఉంచుకోవడం తెలివైన నిర్ణయం. ఎందుకంటే.. తక్కువకాలపు అర్థరహిత ఒప్పందాలు లేదా ఇతరుల జోక్యం వల్ల ఆ బంధం తెగిపోయే ప్రమాదముంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాతే బయట ప్రపంచానికి తెలియజేయడం మంచిది.
ఇంట్లో జరిగే గొడవలు బయటివారికి చెప్పడం వల్ల ప్రయోజనం ఉండకపోగా.. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలహీనపడుతాయి. కుటుంబం అంటేనే పరస్పర విశ్వాసం, గౌరవం. అలాంటి కుటుంబంలో సమస్యలు వస్తే.. ఇంట్లోనే పరిష్కారం వెతుక్కోవాలి. అలా చేస్తే బంధాలు బలపడతాయి, కుటుంబంలో సమరసత పెరుగుతుంది.
55
నమ్మకమే స్నేహానికి పునాది
ఆచార్య చాణక్యుడు ప్రకారం.. స్నేహితుడు మనల్ని నమ్మి, ఏదైన రహస్య విషయాన్ని పంచుకుంటే.. వారి విశ్వాసాన్ని కాపాడుకుంటేనే నిజమైన స్నేహితునిగా నిలబడతాం. ఒకసారి రహస్యం బయటపడితే.. ఆ బంధంలో నమ్మకాన్ని తిరిగి పొందడం చాలా కష్టం.