అన్ని బంధాల్లోకెల్లా భార్యభర్తల బంధం గొప్పదని చెబుతుంటారు. అయితే, చిన్న అపార్థాలు, అనవసర జోక్యాలు ఈ సంబంధాన్ని దెబ్బతీసే ప్రమాదం కలిగి ఉంటాయి. అందుకే ఆచార్య చాణక్యుడు వివాహిత స్త్రీలు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు.
భర్తతో ఉన్న సంబంధం సంతోషంగా ఉన్నా, లేదా చిన్న గొడవలు జరిగినా వాటిని బయటివారితో పంచుకోవడం మంచిది కాదు. ఇతరులకు చెప్పడం వల్ల వారు జోక్యం చేసుకోవచ్చు, దాంతో సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దంపతుల మధ్య ఉన్న బంధాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఏర్పడవచ్చు.
24
ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచాలి
భర్త సంపాదన, కుటుంబ ఆర్థిక స్థితి లాంటి విషయాలు బయటపడితే అనవసరమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. అసూయతో ఉన్నవారు లేదా స్వార్థపరులు ఆ సమాచారం వాడుకుని మానసికంగా లేదా ఆర్థికంగా ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆర్థిక పరిస్థితిని ఇతరులకు తెలియనివ్వడం మంచిది.
34
గోప్యతే సంసారం బలానికి మూలం
చిన్న విషయాలనైనా రహస్యంగా ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య నమ్మకం పెరుగుతుంది. బయటివారి జోక్యం లేకపోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఇది దాంపత్య జీవితంలో సంతోషాన్ని పెంచే కీలకమైన అంశం.
ఒకరికి ఒకరికి ఉన్న ఆరోగ్య సమస్యలు చాలా వ్యక్తిగతమైనవి. వీటిని ఇతరులతో పంచుకోవడం గౌరవాన్ని తగ్గిస్తుంది. పైకి ఎవరూ చెప్పకపోయినా, వెనుకమాటలు రావచ్చు. ఇది దంపతుల మధ్య నమ్మకాన్ని దెబ్బతీసి, కుటుంబంలో అవమానం కలిగించే పరిస్థితిని తెస్తుంది.