సంఖ్యా శాస్త్రం ప్రకారం శని దేవుడికి ఇష్టమైన అంకె 8. కాబట్టి 8 అంకెలో జన్మించిన వారికి జీవితంలో గౌరవం, సంపద అన్నీ దక్కుతాయి. శనీశ్వరుడు వారిని ఎల్లప్పుడూ కాపాడుతాడు.
తొమ్మిది గ్రహాలలో శని దేవుడు ఎంతో ముఖ్యమైన గ్రహం. ఒక మనిషి చేసిన కర్మ ఫలాలను తగ్గట్టు శిక్షను విధించేది కూడా ఆయనే. అందుకే ఎవరి జాతకంలోనైనా శని దేవుడు సానుకూలంగా ఉంటే వారి జీవితం ఆనందంగా సాగిపోతుందని చెప్పుకుంటారు. అయితే శనిదేవునికి ఇష్టమైన అంకె ఎనిమిది. ఎనిమిదో తారీఖున జన్మించిన వారికి శని దేవుడు ఆశీస్సులు ఉంటాయని అంటారు.
25
ఈ తేదీలలో జన్మించిన వారు
ఏ నెలలోనైనా మీరు 8, 17, 26వ తేదీలలో జన్మిస్తే మీ మూల సంఖ్య 8 అవుతుంది. 8వ సంఖ్యకు శనిదేవుడితో ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి వారి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ సంఖ్యలో జన్మించిన వ్యక్తులు కష్టపడి పని చేస్తారు. అంకితభావంతో ఉంటారు.
శని దేవుడు కష్టపడే వారిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాడు. కృషిని బట్టే ఫలితాలను ఇస్తాడు. 8వ సంఖ్యలో జీవించిన వ్యక్తులు పెద్ద వ్యాపారవేత్తలుగా మారుతారు. మీరు కష్టపడి డబ్బు సంపాదిస్తారు. వీరు న్యాయంగా ఉండేందుకు ఇష్టపడతారు.
35
ఇలాంటి వ్యక్తిత్వం
ఎనిమిదో తేదీన సంఖ్యలో జన్మించిన వ్యక్తులు ఎలాంటి పరిస్థితులైన తట్టుకునే శక్తిని కలిగి ఉంటారు. వారు తమ జీవితంలో చెడు విషయాలకు రాజీపడరు. భౌతిక ఆనందాల కోసం పరుగులు పెట్టరు. కానీ వారు న్యాయ పద్ధతిలోనే డబ్బులు సంపాదిస్తారు. వారి విధిని కాకుండా కర్మను నమ్ముతారు. కష్టపడి పని చేయడానికి నమ్ముతారు.
ఎనిమిదవ సంఖ్యలో జన్మించిన వ్యక్తులు అద్భుతమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరి జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. అలాగే ఒత్తిడిలో ఉండేందుకు ఇష్టపడరు. స్వేచ్ఛగా ఉండేందుకే ఇష్టపడతారు. డబ్బు ఆదా చేయడంలో కూడా వీరు నిపుణులు.
55
ఈ రంగంలో డబ్బు సంపాదిస్తారు
8 అంకెను మూల సంఖ్య కలిగిన వ్యక్తులు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి విజయాన్ని అందుకుంటారు. అలాగే చమురు, ఖనిజ సంబంధిత వ్యాపారాలలో కూడా విజయం సాధిస్తారు. న్యాయవాదులుగా లేదా న్యాయమూర్తులుగా కూడా వారు మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎనిమిదవ సంఖ్యలో జన్మించిన వ్యక్తులు పెద్ద కంపెనీలకు యజమానులుగా మారే అవకాశం కూడా ఉంది.