Sankranti Yogam: సంక్రాంతి రోజే బుధాదిత్య రాజయోగం, 3 రాశుల వారి జాతకమే మారిపోతుంది

Published : Jan 13, 2026, 07:01 AM IST

Sankranti Yogam: జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర సంక్రాంతి ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజున ఏర్పడే బుధాదిత్య యోగం కూడా శక్తివంతమైనది. ఆ రోజున సూర్యుడు, బుధుడు కలిసి మకర రాశిలో శుభయోగాన్ని ఏర్పరచబోతున్నారు. ఇది కొన్ని రాశులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. 

PREV
14
బుధాదిత్య రాజయోగం అంటే

సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో కలిసి ఉన్నప్పుడు బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. సూర్యుడు ఆత్మవిశ్వాసానికి, నాయకత్వానికి, గౌరవానికి కారకుడిగా చెబుతారు. ఇక బుధుడు తెలివితేటలకు, వాక్చాతుర్యానికి, వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కారకుడుగా వివరిస్తారు. ఇక ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు కలయిక వల్ల ఒక వ్యక్తి ఆలోచనలు, అవగాహనలో ఎన్నో మార్పులు వస్తాయి. అతని సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు విజయానికి మార్గం సులభతరంగా మారుతుంది. బుధాదిత్య రాజయోగం అనేది కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. ఏ రాశుల వారికి ఇది కలిసి వస్తుందో తెలుసుకోండి.

24
మేష రాశి

మేష రాశి వారికి బుధాదిత్య రాజయోగం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆగిపోయిన పనులు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అయ్యే సమయం ఇది. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు ఎదురొస్తాయి. ఇక విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఆ కోరిక కూడా తీరుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అలాగే మేషరాశి వారి వ్యక్తిత్వం చాలా బలపడి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ముందుకు సాగే మార్గాన్ని మరింత సులభతరం చేస్తుంది.

34
కన్యా రాశి

కన్యా రాశి వారికి బుదాధిత్య రాజయోగం అన్ని సుఖాలను, విలాసాలను అందిస్తుంది. ఇల్లు, వాహనం లాంటి ఆస్తులు కొనడానికి ఇదే మంచి సమయం. కొనే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి. వీరి కుటుంబంలో శాంతి, ఆనందం వెల్లివిరుస్తాయి. ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కుతుంది. ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మానసిక ఒత్తిడి తగ్గి, నిర్ణయాలు సరైన పద్ధతిలో తీసుకుంటారు.

44
కుంభ రాశి

కుంభ రాశి వారికి బుధాదిత్య రాజయోగం అనేది ఎంతో ప్రయోజనకరమైనది. వీరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. అలాగే నెలవారి ఆదాయం కూడా పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు. స్నేహితులు, బంధువులు మీకు ఈ సమయంలో సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. కొత్త పరిచయాలు అనేవి మీకు భవిష్యత్తులో ఎన్నో లాభాలను తెచ్చిపెడతాయి. స్టాక్ మార్కెట్లో ఆలోచించి లాభకరమైన పెట్టుబడులను పెడతారు.

Read more Photos on
click me!

Recommended Stories