బంగారం అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి? మరీ ముఖ్యంగా ఆడవాళ్లు. వారికి, బంగారానికి మధ్య విడదీయరాని బంధం ఉంటుంది. మగవారు కూడా సందర్భానికి తగ్గట్టుగా బంగారాన్ని వేసుకుంటూ ఉంటారు. కానీ ఆడవాళ్లంత మాత్రం కాదు. చాలామంది ఆడవాళ్లు చైన్, రింగ్స్, కమ్మలు ఇలా కొన్ని బంగారు నగలను రోజూ పెట్టుకొనే ఉంటారు. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు బంగారం అస్సలు వేసుకోకూడదట. ఏ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకోవద్దు? ఎందుకు వేసుకోవద్దో ఇక్కడ తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రంలో బంగారాన్ని గురు గ్రహానికి సంబంధించిందిగా పరిగణిస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకోకూడదట. ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే వాళ్లకు లాభం బదులు నష్టం జరుగుతుందట. అసలు ఏ తేదీల్లో పుట్టిన వారు బంగారం ధరించకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
24
గ్రహాల ప్రభావాలు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం కేవలం సంపద, అభివృద్ధికి చిహ్నం మాత్రమే కాదు. అది వేసుకోవడం వల్ల మన జీవితం మీద గ్రహాల అనుకూల, ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. అందుకే బంగారం వేసుకునే ముందు.. అసలు వేసుకోవచ్చో లేదో తెలుసుకోవాలని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు.
34
ఏ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకోవద్దు?
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారికి మూల సంఖ్య 8. 8వ నంబర్ అధిపతి శని గ్రహం. ఈ తేదీల్లో పుట్టినవారు బంగారం వేసుకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. శని, గురు గ్రహాలు వ్యతిరేక స్వభావాలు కలిగి ఉంటాయని చెబుతుంటారు. బంగారం వేసుకోవడం వల్ల గొడవలు, ఆర్థిక నష్టాలు, కోపం, మానసిక ఒత్తిడి పెరుగుతాయని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.
44
హాని జరిగే అవకాశం!
జ్యోతిష్యం ప్రకారం జాతకంలో గురువు శత్రు ఇంట్లో ఉంటే, బంగారం వేసుకోవడం వల్ల మీకు హాని జరిగే అవకాశం ఉందట. దీంతో పాటు, మేషం, వృశ్చిక లగ్నం ఉన్నవాళ్లు కూడా బంగారం వేసుకోకూడదట. శని సాడేసాతి ప్రభావం ఉన్నవారు కూడా బంగారం వేసుకోకపోవడం మంచిదట. బంగారం వేసుకోవడం వల్ల అనవసరమైన వివాదాలు, నష్టాలు, మానసిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట.