గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మార్పులు మన జీవితంపై డైరెక్ట్ గా ప్రభావాన్ని చూపిస్తాయి. గ్రహాలు మారే స్థానాన్ని బట్టి, ఆయా రాశుల జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి. మంచి స్థానాల్లో కదిలితే శుభఫలితాలు వస్తాయి.అలా కాకుండా అశుభ స్థానంలో కదిలితే కష్టాలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అశుభ ప్రభావాలను ఎక్కువగా చూపించే గ్రహాల్లో రాహు గ్రహం ఒకటి. శని తర్వాత చాలా నెమ్మదిగా కదిలేది ఏదైనా ఉంది అంటే అది రాహువు మాత్రమే. ఇప్పుడు రాహువు మే 18వ తేదీన కుంభ రాశిలోకి అడుగుపెట్టనుంది. దీని ఎఫెక్ట్ చాలా రాశులపై ఉంటుంది. కంప్లీట్ గా లైఫ్ లో కష్టాలన్నీ తీరిపోయి.. అదృష్టం పెరుగుతుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..