Zodiac Sign: ఏప్రిల్ 20న నవపంచమ యోగం.. ఈ రాశులకు రాజయోగమే..!

Published : Apr 10, 2025, 01:05 PM IST

  ఏప్రిల్ 20న నవపంచ మ రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం మూడు రాశుల వారికి అనేక రంగాల్లో విజయాలు, ఆర్థిక లాభాలు తెచ్చి పెట్టనుంది. ఊహించని శుభ యోగాలు మోసుకురానుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా..  

PREV
14
Zodiac Sign: ఏప్రిల్ 20న నవపంచమ యోగం.. ఈ రాశులకు రాజయోగమే..!


ఏప్రిల్ 20వ తేదీన తెల్లవారుజామున 4:20 గంటలకు వరుణుడు, కుజుడు మధ్య 120 డిగ్రీల దూరం ఏర్పడి, నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శక్తివంతమైన యోగం. వరుణుడు నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణిస్తారు. ఒక్కో రాశిలో దాదాపు 14 సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం వరుణుడు మీన రాశిలో ఉన్నాడు. ఈ యోగం ప్రభావం 12 రాశులపై ఉన్నా, 3 రాశుల వారికి ఇది ఎంతో శుభదాయకం. వారు జీవితంలోని అనేక రంగాలలో అద్భుతమైన విజయాలను సాధించగలరు. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

24

కన్య రాశి...
నవపంచమ యోగం కన్య రాశివారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కోర్టు, అధికారిక వ్యవహారాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. భౌతిక ఆనందాలపై ఫోకస్ పెరిగి, కోరుకున్నవన్నీ నెరవేరతాయి. కెరీర్ లో మీరు కష్టపడిన ప్రతిఫలం అందుతుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో శాంతి, ఆనందం లభిస్తుంది. భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది.

34

తుల రాశి...
తుల రాశి వారికి నవపంచమ యోగం సమస్త రంగాల్లో విజయాన్ని అందించగలదు.ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరులతో మీ ఆలోచనలు ధైర్యంగా పంచుకుంటారు. ఇది ఈ రాశివారికి మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. ఉద్యోగంలో  కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలోనూ బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. వ్యాపారాల్లో భారీ లాభాలు చూస్తారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు.


 

44


కర్కాటక రాశి:
ఈ యోగం కర్కాటక రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల్లో విజయం సాధించడమే కాకుండా, ఆర్థిక లాభాలు కూడా అందుతాయి. కుటుంబంలోని వైవాహిక లేదా వ్యక్తిగత గొడవలు తగ్గిపోతాయి. ఆధ్యాత్మిక అభిరుచి పెరుగుతుంది. మతపరమైన యాత్రలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ మార్పులు జరగవచ్చు. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories