Birth Date: న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ ఆధారంగా మన స్వభావం, ఆలోచనలు ఉంటాయని చెబుతుంటారు. రాడిక్స్ నెంబర్ ఆధారంగా మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు. న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నెంబర్ 1 వారిలో ఉండే లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 1గా భావిస్తారు. అంటే మీరు జన్మించిన తేదీలోని నెంబర్స్‌ను యాడ్ చేస్తే వచ్చే నెంబర్‌ను రాడిక్స్ నెంబర్ అంటారు. రాడిక్స్ నెంబర్ 1కు అధిపతి గ్రహం సూర్యుడు. సూర్యుడు అంటే నాయకత్వం, ధైర్యం, గౌరవం, విజయం, శక్తి వంటి లక్షణాల సూచిక. అందుకే ఈ తేదీల్లో పుట్టినవారి వ్యక్తిత్వంలో సహజంగా ఆత్మవిశ్వాసం, ఆధిపత్య లక్షణాలు ఉంటాయి.
25
వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది?
ఆత్మవిశ్వాసం ఎక్కువ: వీరు ఎలాంటి పని చేసినా ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఇతరులపై ఆధారపడటం వీరి స్వభావం కాదు.
స్వతంత్రంగా నిర్ణయాలు: తదేకంగా ఆలోచించి, స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. వారికి స్వేచ్ఛ, ఆలోచనల స్వాతంత్రం చాలా ముఖ్యం.
గౌరవం, నాయకత్వం: ఎక్కడ ఉన్నా నాయకత్వం తీసుకునే ధైర్యం వీరిలో సహజంగా ఉంటుంది. ఇవ్వాళ చిన్న స్థాయిలో ఉన్నా, భవిష్యత్తులో ఎదిగే అవకాశాలు బలంగా ఉంటాయి.
35
పనిలో, రోజువారీ జీవితంలో కీలక లక్షణాలు:
పనిలో పరిపూర్ణత: ఏ పని చేసినా శ్రద్ధగా, పూర్తి సిద్ధతతో చేస్తారు. చిన్న పనైనా, పెద్ద పనైనా వీరికి నాణ్యత చాలా ముఖ్యం.
సమస్యలు వచ్చినా భయపడరు: ఇబ్బందులు వచ్చినప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తారు. ప్రారంభంలో కష్టాలు ఎక్కువైనా, చివరకు విజయం సాధించడం వీరి ప్రత్యేకత.
ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమిస్తారు: వీరు ఒకరిని ప్రేమిస్తే దానిని జీవితాంతం సీరియస్‌గా తీసుకుంటారు. మోసం, అబద్ధం, నమ్మకద్రోహం లాంటివి అస్సలు సహించరు.
భాగస్వామికి స్వేచ్ఛ ఇస్తారు: బంధాల్లో బలవంతపు నియమాలు పెట్టరు. ఎవరినైనా కట్టిపడేయడం వీరి స్టైల్ కాదు.
గౌరవం ఇస్తారు: మీ భాగస్వామి వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తారు. వారికి స్వంతమైన సమయం కావాలంటే ప్రశాంతంగా అంగీకరిస్తారు.
55
బంధం బలంగా ఉండాలంటే..
రాడిక్స్ నెంబర్ 1 గలవారిలో చిన్న అహంకారం, తమ నిర్ణయాలపై అధిక పట్టుదల ఉంటుంది. అది కొన్నిసార్లు సంబంధంలో దూరాలు తీసుకురాగలదు. అందుకే కొంచెం వినయంతో వ్యవహరించడం మంచిది. భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వడం, భావోద్వేగాలను స్పష్టంగా చెప్పడం, ఇలా చేస్తే ప్రేమ జీవితం మరింత అందంగా మారుతుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.