Baba Vanga: 2026లో ఆ విప‌త్తు త‌ప్ప‌దా.? భ‌య‌పెడుతోన్న బాబా వంగా భ‌విష్య‌వాణి

Published : Dec 17, 2025, 02:03 PM IST

Baba Vanga: బల్గేరియా దేశానికి చెందిన ప్రసిద్ధ జ్యోతిష్కురాలు బాబా వంగా గురించి ప్రపంచమంతా తెలుసు. 1911లో జన్మించిన ఆమె చిన్నతనంలోనే చూపు కోల్పోయారు. చూపు కోల్పోయిన తర్వాత ఆమె భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో వివరాలను తెలియజేశారు. 

PREV
15
2026పై బాబా వంగా భవిష్యవాణి

2025 ముగింపు దశకు చేరింది. కొత్త ఏడాది 2026 ప్రపంచానికి ఎలా ఉండబోతోందనే ఆసక్తి ప్రజల్లో పెరుగుతోంది. ఈ సమయంలో బల్గేరియాకు చెందిన బాబా వంగా అంచనా వేసిన కొన్ని విషయాలు భయపెడుతున్నాయి. గతంలో ఆమె చెప్పిన కొన్ని అంచనాలు నిజమయ్యాయని నమ్మకం ఉండటంతో 2026పై చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

25
2026లో తీవ్ర ఆర్థిక సంక్షోభం వస్తుందా?

బాబా వంగా అంచనాల ప్రకారం 2026లో ప్రపంచం తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. ప్రజలు డబ్బు కోసం ఇబ్బంది పడే స్థితి ఏర్పడుతుందని చెప్పినట్లు కథనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని క్యాష్ క్రాష్ లేదా ఆర్థిక కుదుపుగా అభివర్ణిస్తున్నారు. సాధారణ జీవనం కూడా కష్టంగా మారే అవకాశం ఉందనే భయం వ్యక్తమవుతోంది.

35
కరెన్సీ వ్యవస్థపై పడే ప్రభావం

రిపోర్టుల ప్రకారం డిజిటల్ కరెన్సీతో పాటు హార్డ్ కరెన్సీ వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశముందని అంచనా. బ్యాంకింగ్ వ్యవస్థలో ఒత్తిడి పెరగవచ్చు. కరెన్సీ విలువ తగ్గడం, మార్కెట్లలో డబ్బు లభ్యత తగ్గడం వంటి సమస్యలు మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపించవచ్చు.

45
ఈ సంక్షోభం వల్ల ఇతర రంగాలపై ప్రభావం

ఒకవేళ నిజంగానే ఆర్థిక కష్టాలు మొదలైతే దాని ప్రభావం ఇతర రంగాలపై కూడా పడుతుంది. ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు ఎగబాకవచ్చు. టెక్నాలజీ రంగంలో అనిశ్చితి పెరిగే పరిస్థితి రావచ్చు. ఉద్యోగ భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తవచ్చని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

55
బాబా వంగా ఇతర అంచనాలు

ఆర్థిక సంక్షోభంతో పాటు బాబా వంగా 2026పై మరికొన్ని అంచనాలు కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులు, ప్రపంచ స్థాయి సంఘర్షణలు, ఏఐ టెక్నాలజీలో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇవన్నీ నిజమవుతాయా అనే దానిపై స్పష్టత లేకపోయినా ప్రజల్లో చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.

గమనిక: పైన తెలిపిన విష‌యాలను ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Read more Photos on
click me!

Recommended Stories