మకర రాశి....
శని దేవుడికి అత్యంత ఇష్టమైన రాశి మకర రాశి. అందువల్ల, 2026లో శని ప్రభావం మకర రాశి వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. సుమారు 6 నెలల పాటు ఈ రాశివారికి అదృష్టం పట్టనుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో కీలకమైన ప్రాజెక్టులు చేపడతారు. వాటిలో కూడా విజయం సాధిస్తారు. శత్రువులపై కూడా విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు చాలా లాభదాయకంగా మారతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు తీసుకునే నిర్ణయాలన్నీ చాలా అనుకూలంగా మారతాయి.
ఫైనల్ గా....
మొత్తానికి, 2026లో శని గ్రహ సరళ సంచారం వల్ల కన్యా, తులా, మకర రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక, వ్యక్తిగత జీవితాల్లో శుభఫలితాలు దక్కే అవకాశాలు బలంగా ఉన్నాయి. శని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలంటే క్రమశిక్షణ, నిజాయితీ, కష్టపడి పని చేసే స్వభావాన్ని కొనసాగించడం ఎంతో అవసరం.