Zodiac Signs : జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశులవారు పుట్టుకతోనే ధైర్యవంతులు. అంటే సినిమాల్లో హీరోలమాదిరిగా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఈ రాశులవారు నిజజీవితంలో హీరోగా గుర్తింపు పొందుతారు.
Zodiac Signs : జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. సవాళ్లు, అడ్డంకులు, వ్యతిరేకతలు మనుషులను పరీక్షిస్తాయి. కొందరు భయపడి వెనక్కి తగ్గుతారు… కానీ మరికొందరు వీటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొనిమరీ అనుకున్నది సాధిస్తారు… జీవితాన్ని గెలుస్తారు.
జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశులవారు పుట్టుకతోనే ధైర్యవంతులు. వీరి ధైర్యమే వారిని నిజజీవితంలో హీరోలను చేస్తుంది. ఇలా మేషం, సింహం, ధనుస్సు రాశుల వారు ధైర్యానికి, మనోస్థైర్యానికి ప్రసిద్ధి. ఎలాంటి కష్టమొచ్చినా, ఎంత పెద్ద శత్రువు ఎదురైనా వీరు అస్సలు చలించరు.
25
మేషరాశి
మేషరాశి వారు పుట్టుకతోనే విజయం సాధించాలనే తపనతో ఉంటారు. కుటుంబం, స్నేహితులు, ఉద్యోగ జీవితంలో కూడా ధైర్యంగా ఉంటారు. అనుకోని అడ్డంకులు వస్తే వాటిని నేరుగా ఎదుర్కొని పరిష్కరించగల సత్తా వీరికి ఉంది.
ఉదాహరణకు ఒక మేషరాశి విద్యార్థి కఠినమైన పరీక్షలో ఫెయిల్ అయినా, వెంటనే మరింత పట్టుదలతో, ఎక్కువ శ్రద్దతో కష్టపడి చదవుతూ ముందుకు సాగుతాడు. వీరి మనోస్థైర్యం, లక్ష్యం వైపు సాగే తత్వం వీరిని ప్రత్యేకంగా నిలుపుతుంది. కాబట్టి మొదట ఫెయిల్యూర్స్ ఎదురైనా చివరకు విజయం వీరిని వరిస్తుంది.
35
సింహరాశి
సింహరాశి వారు ఎదుటివారు వ్యతిరేకిస్తున్నా వెనకడుగు వేయరు. వారిలోని ఆత్మవిశ్వాసం, ధైర్యం పెద్ద బాధ్యతలను స్వీకరించేలా చేస్తాయి. ఇలా ధైర్యంగా ముందుకు వెళ్లే మనస్తత్వమే వీరిని ఏ రంగంలో అయినా రాణించేలా చేస్తుంది.
ఉదాహరణకు పనిచేసే సంస్థలో ఏదైనా సమస్య వస్తే సింహరాశివారు నాయకుడిలా ధైర్యంగా నిలబడతారు… టీమ్ మొత్తాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. వీరి వ్యక్తిత్వం, నిజాయితీ, నాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకర్షిస్తాయి. వీరు ఎప్పుడూ భయపడరు, సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు. ఉద్యోగమే కాదు వ్యాపారంలోనూ వీరు దూకుడును ప్రదర్శిస్తారు.
ధనుస్సు రాశి వారు సాధారణంగా తెలివితేటలతో, అనుభవంతో సమస్యలను పరిష్కరించడంలో ప్రసిద్ధులు. కానీ కీలక సమయాల్లో వారు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో నిలబడతారు. ఇలా ధనుస్సు రాశి ఉద్యోగి కఠినమైన ప్రాజెక్టును చేపట్టి, ఎన్ని అడ్డంకులు ఎదురైనా చలించకుండా పూర్తి చేస్తాడు. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినా మనోస్థైర్యంతో ముందుకు సాగుతారు. వీరి నమ్మకం, ధైర్యం గొప్ప విజయాలకు దారితీస్తాయి.
55
ఈ రాశులవారు ఆదర్శం...
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారు జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రత్యేకమైనవారు. వీరి ధైర్యం, మనోస్థైర్యం విజయానికి ముఖ్య కారణాలు. సింహం ఎదురైనా వీరు చలించరు. జీవితంలో గెలవాలంటే మనోస్థైర్యం, ధైర్యం, కార్యాచరణ ముఖ్యం అని వీరు అందరికీ నేర్పుతారు. కఠిన పరిస్థితుల్లోనూ వీరు ధైర్యంగా ఉండటం చూస్తే ఇతరులకు కూడా భయం లేకుండా ముందుకు వెళ్లే నమ్మకం, ధైర్యం వస్తాయి.
గమనిక
ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, సాధారణ జ్యోతిష్య అంచనాల ఆధారంగా రాయబడింది. దీని కచ్చితత్వాన్ని ఏషియానెట్ తెలుగు నిర్ధారించదు. పూర్తి వివరాలకు జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది