Zodiac signs: దసరా సమయంలో కూడా ఇలాంటి గ్రహాల మార్పు జరగనుంది. బుధుడు కేంద్ర దృష్టియోగం ఏర్పడనుంది. దీని వల్ల చాలా రాశులకు లాభాలు కలగనున్నాయి. ఈ దృష్టి యోగం ఏర్పడిన సమయంలో బుధుడు, గురు గ్రహాలు ఒకరికొరు ఎదురుపడతాయి. ఇది... చాలా రాశులకు మేలు చేస్తుంది.
జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు తరచూ మారుతూ ఉంటాయి. ఈ గ్రహాల మార్పులు.. కొన్ని రాశులకు శుభ ఫలితాలను మోసుకొస్తే.. కొన్ని రాశులకు సమస్యలు కూడా తీసుకువస్తాయి. దసరా సమయంలో కూడా ఇలాంటి గ్రహాల మార్పు జరగనుంది. బుధుడు కేంద్ర దృష్టియోగం ఏర్పడనుంది. దీని వల్ల చాలా రాశులకు లాభాలు కలగనున్నాయి. ఈ దృష్టి యోగం ఏర్పడిన సమయంలో బుధుడు, గురు గ్రహాలు ఒకరికొరు ఎదురుపడతాయి. ఇది... చాలా రాశులకు మేలు చేస్తుంది. మరి, దసరా సమయంలో బాగా కలిసొచ్చే రాశులు ఏంటో చూద్దామా....
26
1.మేష రాశి...
బుధుడు- గురు కేంద్ర దృష్టి యోగం ప్రభావం కారణంగా.. మేష రాశి వారికి చాలా మేలు జరగనుంది. ముఖ్యంగా మేష రాశివారికి కెరీర్ లో కొత్త అవకాశాలు రానున్నాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మంచి హోదాకు వెళ్లే అవకాశం ఉంది.
36
2.మిథున రాశి...
మిథున రాశి వారి మాట , తెలివితేటలలో మెరుగుదల చూస్తారు. ఈ రాశివారు ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు విద్య, రచన, ప్రసంగం వంటి ఏ రంగంలో ఉన్నా.. మంచి ఎదుగుదల ఉంటుంది. ఈ సమయంలో డబ్బు ఎక్కువగా సంపాదించగలరు.
ఆర్థిక , వృత్తిపరమైన దృక్కోణం నుండి కన్య రాశి వారికి ఈ కలయిక శుభప్రదం. మీ నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తాయి. వ్యాపారవేత్తలు లాభాలను చూసే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సమయం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది.
56
ధనుస్సు రాశి...
ఈ సమయం ధనస్సు రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా బాగా కలిసొస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కెరీర్ లో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మంచి స్థాయికి వెళ్లగలరు.
66
మీన రాశి
మీన రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కళ, సంగీతం , సృజనాత్మక కార్యకలాపాలలో పురోగతి సాధించే సమయం. కుటుంబ జీవితం సంతోషంగా , ప్రశాంతంగా ఉంటుంది. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. ఈ యోగం మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది.