Birth Month: ఈ నెలలో పుట్టిన వారికి సుడి ఎక్కువ, చిన్న వయసులోనే తెగ డబ్బు సంపాదిస్తారు

Published : Jul 31, 2025, 04:47 PM IST

జోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని నెలలో పుట్టిన వారు ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్లగలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి, ఆ నెలలేంటో చూద్దామా.. 

PREV
15
Birth Month

మానవ జీవితాలను డబ్బు ముందుకు నడిపిస్తోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ డబ్బు సంపాదించుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రోజంతా కష్టపడి డబ్బు సంపాదించాలని కొందరు భావిస్తే.... దొంగతనాలు, దోపిడీలు, మోసాలు అయినా చేసి ఎలాగైనా డబ్బు సంపాదించాలని మరి కొందరు ఆలోచిస్తారు. 

మన కనీస అవసరాల నుంచి.. లగ్జరీ లైఫ్ వరకు కోరుకున్నవి అన్నీ ఈ డబ్బు ద్వారానే లభిస్తాయి. అయితే.. ఈ డబ్బు అందరికీ అంత సులభంగా ఏమీ లభించదు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. కొన్ని నెలలో జన్మించిన వారికి మాత్రం ఇది కాస్త సులభం అవుతుంది.  ఏ నెలలో పుట్టిన వారికి డబ్బు సమస్యలు లేకుండా, జీవితం ఆనందంగా గడుపుతారో, చిన్న వయసులోనే ధనవంతులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

25
ఏప్రిల్ నెల

ఏప్రిల్ నెలలో పుట్టిన వారు డబ్బు విషయంలో కాస్త అదృష్టం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వీరు దాదాపు 40 ఏళ్లు వచ్చేలోగానే మంచి స్థాయిలో ఉంటారు. ఎక్కువ డబ్బు సంపాదించగలరు. 

ఈ నెలలో పుట్టిన వారు సహజంగానే కష్ట జీవులు.సవాళ్లను స్వీకరించి విజయం సాధించడమే వారి లక్ష్యం. విజయం కోసం ఎదురుచూడరు. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వారికి నాయకత్వ లక్షణాలుంటాయి. కృషి, లక్ష్యం కోసం ఏ పనైనా చేస్తారు. ధైర్యంతో ముందుకు సాగి 40 ఏళ్లలోపు ధనవంతులవుతారు.

35
జూన్ నెల

జూన్‌లో పుట్టినవారికి మంచి సంభాషణ నైపుణ్యాలు, తెలివితేటలు, సమాచార సేకరణపై ఆసక్తి ఉంటుంది. వ్యాపారంలో రాణిస్తారు. మంచి పెట్టుబడిదారులు, డబ్బును కాపాడుకోవడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఆర్థిక నిర్వహణలో రాణించి సంపదను పెంచుకుంటారు. జూన్‌లో పుట్టినవారు ఆలోచించి, సరైన మార్గాల్లో పనిచేస్తారు. సంపదను పెంచుకునే తెలివితేటలు వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు.

45
అక్టోబర్ నెల

అక్టోబర్‌లో పుట్టినవారు ప్రతిభావంతులు, ఆకర్షణీయంగా ఉంటారు. వారికి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఉద్యోగం కంటే వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనే తపన కలిగి ఉంటారు. ఇతరులతో కలిసిపోవడం, స్నేహం చేయడం ఇష్టపడతారు. ఈ పరిచాయాల ద్వారా లాభం ఎలా పొందాలో వీరికి బాగా  తెలుసు. విజయం సాధించాలనే తపనతో కష్టపడి పనిచేస్తారు. ఈ కృషి వారిని ధనవంతులను చేస్తుంది. చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు.

55
డిసెంబర్ నెల

డిసెంబర్‌లో పుట్టినవారు తెలివైనవారు, ఓపికగలవారు. వీరికి ఆత్మ క్రమశిక్షణ ఎక్కువ. కష్టపడి లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన కలిగి ఉంటారు. సమయాన్ని వృధా చేయరు. కలలపై దృష్టి పెడతారు. వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో చక్కగా రాణిస్తారు. మంచి జీవితం కోసం డబ్బు ఆదా చేస్తారు. 40 ఏళ్లలోపు కోటీశ్వరులవుతారు.

(గమనిక: ఈ కథనం ఆన్‌లైన్‌లో లభించే ఊహాగానాలు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ఆధారంగా రూపొందించాం. దీని విశ్వసనీయతకు ఏషియానెట్ న్యూస్ బాధ్యత వహించదు. నిజ జీవితంలో విజయానికి కృషి, పట్టుదల, నైపుణ్యాలే కారణం. జ్యోతిష్యం ఒక మార్గదర్శకం మాత్రమే. మీ విజయం, ధనవంతులు కావడం మీ చేతుల్లోనే ఉంది. డబ్బు సంతోషకరమైన జీవితానికి ఒక సాధనం మాత్రమే. విజయానికి ప్రణాళిక, పట్టుదల, కృషి అవసరం.)

Read more Photos on
click me!

Recommended Stories