Friendship Day: పాపం..! ఈ రాశులవారికి స్నేహితులు చాలా తక్కువ..!

Published : Jul 31, 2025, 02:03 PM IST

వీరికి స్నేహం అన్నా, స్నేహితులన్నా ఇష్టం ఎక్కువగానే ఉంటుంది. కానీ.. స్నేహితులను ఎలా చేసుకోవాలో వీరికి తెలీదు. దాని వల్లే వీరికి ఎక్కువ మంది స్నేహితులు ఉండరు.

PREV
16
Zodiac signs

జీవితంలో స్వచ్ఛమైన స్నేహాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. స్నేహం అనేది ప్రతి ఒక్కరికీ అవసరమైన బంధం. కానీ, అలాంటి స్నేహం అందరికీ దొరకదు. కొంత మంది తమ వ్యక్తిత్వం కారణంగా... ఎక్కువ మందితో స్నేహం చేయలేరు. వారికి చాలా అంటే చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారు. వారికి స్నేహం అంటే నమ్మకం లేదు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. వీరికి స్నేహం అన్నా, స్నేహితులన్నా ఇష్టం ఎక్కువగానే ఉంటుంది. కానీ.. స్నేహితులను ఎలా చేసుకోవాలో వీరికి తెలీదు. దాని వల్లే వీరికి ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. మరి , ఆ రాశులేంటో చూద్దామా...

26
1.కన్య రాశి ( Virgo):

కన్య రాశివారు ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటారు. ప్రతి చిన్న విషయాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తారు. ఎవరితోనూ చొరవగా ముందు వీరు మాట్లాడరు. ఎదుటివాళ్లు ముందుగా మాట్లాడితే తప్ప.. వీరు తిరిగి బదులు ఇవ్వరు. అందుకే.. వీరికి స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు. వీరి ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నగా ఉంటుంది.

36
2.వృశ్చిక రాశి ( Scorpio):

ఈ రాశివారికి చాలా విషయాలు మాట్లాడాలని, అందరితో చెప్పాలని అనుకుంటూ ఉంటారు. కానీ , మనసులో విషయాన్ని తొందరగా బయటపెట్టరు. ఎవరితో అయినా స్నేహం చేస్తే.. వారు తమను మోసం చేస్తారేమో, ద్రోహం చేస్తారేమో అని భయపడుతూ ఉంటారు. తమ సీక్రెట్స్ అన్నీ ఎవరికైనా చెబితే, బయట పెట్టేస్తారేమో అనే భయం ఉంటుంది. దీని కారణంగా.. వీరు ఎక్కువ మందితో స్నేహం చేయరు.

46
3. మకర రాశి (Capricorn):

మకర రాశివారికి స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు. వీరు లక్ష్యసాధనపై ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. వీరికి కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. తమ బాధ్యతల భారం వల్ల మకర రాశి వారు భావోద్వేగ అనుబంధాల్ని నిర్లక్ష్యం చేస్తారు. స్వాతంత్య్రాన్ని కోరుకునే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా వీరికి స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు.

56
4.కుంభ రాశి.. (Aquarius):

 కుంభ రాశివారికి తెలివి తేటలు చాలా ఎక్కువ. వీరు ప్రతి విషయంలోనూ చాలా తెలివిగా ఆలోచిస్తారు. తమ ఎమోషన్స్ కంటే.. ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు బంధాలను చాలా తేలికగా తీసుకుంటారు. దీని కారణంగానే వీరికి స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు.

66
5. మేష రాశి (Aries)

తమదైన దారిలో ముందుకు సాగే వ్యక్తిత్వం మేష రాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వారి పోటీ స్వభావం, స్వతంత్రంగా ఉండాలి అనుకునే వీరి స్వభావం కారణంగా.. వీరు ఎక్కువగా ఇతరులతో కలవలేరు. తాము ఒంటరిగా ఉండాలని ఫీలౌతారు. ఈ వ్యక్తిత్వం కారణంగా వీరికి స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు.

ఫైనల్ గా..

ఈ రాశులవారికి అస్సలు స్నేహితులు ఉండరు అని కాదు. కానీ.. చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారు. జీవితంలో ఒకరు లేదా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే చాలు అని అనుకుంటారు. అందుకే.. ఒకరిద్దరిని మించి ఎవరితోనూ స్నేహం చేయలేరు.

Read more Photos on
click me!

Recommended Stories