Astrology: గ్రహాల సంచారం కొన్నిసార్లు జీవితం సాఫీగా నడిపిస్తే, కొన్నిసార్లు పరీక్షల బాటలో నడిపిస్తుంది. ప్రస్తుతం గురు గ్రహం చంద్రుడికి అనుకూల స్థానాల్లో లేకపోవడంతో శకట యోగ ప్రభావం కనిపిస్తోంది. దీంతో కొన్ని రాశుల ఆర్థిక పరిస్థితిపై పడనుంది.
మేష రాశివారికి గురు తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఆర్థికంగా అస్థిరత ఏర్పడుతుంది. డబ్బు సంపాదించేందుకు కష్టపడినా ఆశించిన ఫలితం దక్కదు. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడం కష్టమే. అవసర సమయంలో సహాయం పొందిన వారే ముఖం చాటేయవచ్చు. సన్నిహితుల నమ్మకంతో చేసే లావాదేవీలు నష్టాన్ని మిగిల్చే అవకాశం ఎక్కువ. ఈ సమయంలో దానాలు, ఉచిత సహాయాలు పూర్తిగా నివారించడం మేలు.
25
మిథునం: ఆదాయం ఉన్నా చేతిలో నిలవదు
మిథున రాశివారికి గురు సంచారం వల్ల బయటకు అన్నీ బాగానే కనిపించినా లోపల ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. లెక్కలు తప్పడం, నిర్ణయాలు ఆలస్యం కావడం వల్ల డబ్బు వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. రావలసిన సొమ్ము ఒక పట్టాన అందదు. బంధువుల అవసరాలు ఖర్చులను పెంచుతాయి. ఆస్తి సంబంధిత చర్చలకు దూరంగా ఉండడం ఉత్తమం. ఈ సమయంలో ఓర్పే ప్రధాన ఆయుధం.
35
కర్కాటకం: ఖర్చులు అదుపు తప్పే సూచనలు
కర్కాటక రాశివారికి గురు వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువవుతాయి. అవసరం లేని చోట కూడా డబ్బు ఖర్చయ్యే పరిస్థితి ఉంటుంది. వైద్య ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. ఆశలు, ఆకర్షణల వెంట వెళ్లడం వల్ల చేతికి వచ్చిన సంపాదన కూడా వృథా అవుతుంది. ఈ కాలంలో పెట్టుబడులు పెట్టడం పూర్తిగా నివారించాలి. జూన్ మొదటి వారం వరకు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది.
వృశ్చిక రాశివారికి గురు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక ఒడిదుడుకులు ఎక్కువగా కనిపిస్తాయి. రావాల్సిన సొమ్ము ఆలస్యం కావచ్చు లేదా పూర్తిగా ఆగిపోవచ్చు. కుటుంబ ఖర్చులు ఒక్కసారిగా పెరుగుతాయి. జీతం, వేతనాలు సకాలంలో అందకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల మాటలు నమ్మి డబ్బు పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది.
55
మకరం: సంపాదన ఉన్నా సమస్యలు వెంటాడుతాయి
మకర రాశివారికి గురు షష్ట స్థానంలో ఉండటం వల్ల ఎంత సంపాదించినా ఆర్థిక ఇబ్బందులు వెంటాడతాయి. చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. బంధువుల నుంచి ఆర్థిక సహాయం కోరుతూ ఒత్తిడి పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు శ్రమను పెంచుతాయి కానీ ఫలితం తక్కువగా ఉంటుంది. రావాల్సిన ధనం ఆలస్యం కావచ్చు. ఈ సమయంలో ఇతరులకు డబ్బు విషయంలో హామీ ఇవ్వడం ప్రమాదకరం.
గమనిక: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, పలువురు పండితులు తెలిపిన వివరాల ప్రకారం అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.