Shani Transit: ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి శని దేవుడు, ఈ 4 రాశుల వారి కష్టాలు తీరినట్టే

Published : Jan 28, 2026, 10:28 AM IST

Shani Transit: శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోని మూడవ పాదంలోకి ప్రవేశించబోతున్నాడు. శని తన సొంత నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు. దీనివల్ల నాలుగు రాశుల వారికి మేలు జరుగుతుంది. ఆ రాశులేవో తెలుసుకోండి. 

PREV
14
మిథున రాశి

శని సంచారం మిథున రాశి వారికి ఎన్నో ప్రయోజనాలను తీసుకొస్తుంది. వీరి కెరీర్లో మంచి ఎదుగుదల కనిపిస్తుంది. వ్యాపారంలో కూడా అపారమైన పురోగతి వస్తుంది. మిథున రాశి వారికి ఆర్థిక లాభాలు కూడా అందుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉన్నత హోదా వస్తుంది. వీరికి కొత్త ప్రాజెక్టులు చేతికి అందే అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామి నుంచి కూడా వీరికి పూర్తి మద్దతు దక్కుతుంది. ప్రేమ, అనుబంధాలలో వీరు మరింత సంతోషంగా ఉంటారు.

24
తులా రాశి

శని సంచారం తులా రాశి వారికి భీభత్సంగా కలిసి వస్తుంది. వీరికి శని సంచారం శుభప్రదంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి అదనపు ఆదాయం మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త ఆదాయ వనరులు కూడా వస్తాయి. విపరీతంగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. వీరు చేసే పనిలో గౌరవం దక్కుతుంది. అలాగే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారం చేస్తున్న వారికి ఆకస్మికంగా పురోగతి కనిపించవచ్చు. ఇప్పటికే ఇబ్బంది పడుతున్న అనారోగ్యాల నుంచి ఉపశమనం దక్కుతుంది.

34
మకర రాశి

మకర రాశి వారికి శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోని మూడవ పాదంలోకి అడుగుపెట్టడం ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. వీరికి అన్ని రకాల సుఖాలు, విలాసాలు దక్కుతాయి. వాహనానికి సంబంధించి లేదా ఆస్తికి సంబంధించిన సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా ఆనందం పెరుగుతుంది. ఇక వీరు చేసే వ్యాపారం మంచి అభివృద్ధిని పొందుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు.

44
కుంభ రాశి

కుంభ రాశి వారికి కూడా శని సంచారం ఎన్నో అదృష్టాలను తెచ్చిపెడుతుంది. ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకే శని సంచారం వీరికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. వీరు తమ కష్టానికి పూర్తిగా ప్రతిఫలాన్ని పొందుతారు. తోబుట్టువులతో ఉన్న అన్ని గొడవలు ఇప్పుడు ముగిసిపోతాయి. చాలాకాలంగా మనసులో ఉండిపోయిన కోరిక నెరవేరే కాలం ఇది. ప్రయాణాలు చేయాల్సిన అవసరాలు కూడా కనిపిస్తాయి. కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి కూడా ఇది సరైన సమయం.

Read more Photos on
click me!

Recommended Stories