Shani : కనికరించి శని... ఈ మూడు రాశులవారే 2026లో అదృష్టవవంతులు..!

Published : Dec 09, 2025, 01:29 PM IST

నవ గ్రహాల్లో శని చాలా పవర్ ఫుల్.. అలాంటిది ఆయనే కనికరించడంతో కొత్త సంవత్సరం కొన్ని రాశులవారికి సరికొత్తగా ప్రారంభంకానుంది. కష్టనష్టాలు తొలగి జీవితం మారిపోతుందట…

PREV
15
కరునించిన శని

Astrology : జ్యోతిష్యాన్ని నమ్మేవారు జీవితంలో కష్టాలుంటే శని ప్రభావమేనని బలంగా నమ్ముతారు. జాతకం ప్రకారం శని గ్రహ స్ధానాన్ని బట్టే జీవితం సాగుతుందని... కష్టసుఖాలు, లాభనష్టాలు దీనివల్లేనని నమ్ముతారు. శని దోష నివారణకు పూజలు, దానాలు చేస్తుంటారు... ఇలా వివిధ రకాలుగా శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి పరిహారాలేవీ లేకుండానే కొన్ని రాశులవారిపై శని ప్రభావం తగ్గిందట.

25
బలహీనపడిన శని

రాబోయే 76 రోజులపాటు శని దేవుడు శక్తిని కోల్పోనున్నాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ డిసెంబర్ 5, 2025 నుండి శని బలహీన స్థితిలో సంచరించనున్నాడట. దీనివల్ల రాబోయే రెండుమూడు నెలలు (డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి) కొన్ని రాశులవారిపై శని ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు. ఇలా ఏఏ రాశులవారిపై శని ప్రభావం తగ్గుతుంది... ఎవరికి మంచిరోజులు రాబోతున్నాయో తెలుసుకుందాం.

35
తులా రాశివారికి ఉద్యోగాలు

తులా రాశి వారికి 4, 5వ ఇంటి అధిపతి అయిన శని 6వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ సంచారం శక్తివంతమైనది. కాబట్టి ఈ రాశి విద్యార్థులకు ఇది అనుకూల సమయం. పరీక్షలలో మంచి మార్కులు వస్తాయి. చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నావారికి కూడా ఇది మంచి సమయం... మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

45
కుంభ రాశికి ధనలాభం

కుంభ రాశికి రెండవ ఇంట్లో శని సంచరిస్తాడు. ఇది ధన స్థానం. శని బలహీనంగా ఉండటంతో కుటుంబ కలహాలు తీరతాయి. అనవసర ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అంటే డబ్బులకు లోటు ఉండదు... ఆస్తిపాస్తులు కూడా సమకూర్చుకుంటారు.

55
మీన రాశి వారికి వివాహం

మీన రాశి వారికి శని మొదటి ఇంట్లో ఉంటాడు. శని బలహీనంగా ఉండటంతో మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఆగిపోయిన పనులు కూడా వేగవంతమవుతాయి. యువతీయువకుల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories