Jupiter Rise: నాలుగు రోజులు ఓపికపడితే చాలు.. ఈ 5 రాశులకు డబ్బే డబ్బు!

Published : Jul 04, 2025, 03:26 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, శ్రేయస్సుకు కారకుడైన గురు గ్రహం జూలై 9న ఉదయించనుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు రానున్నాయి. వారు పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఏ రాశివారికి గురు ఉదయం మంచి చేస్తుందో ఇక్కడ చూద్దాం.  

PREV
16
గురుగ్రహ ఉదయం..

జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గురు గ్రహం దాదాపు నెలరోజుల అస్తమయం తర్వాత జూలై 9న ఉదయించనుంది. ఆ ప్రభావంతో కొన్ని రాశులవారికి మేలు జరగనుంది. వారి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోనున్నాయి. మరి ఏ రాశివారికి గురు ఉదయం లాభాలు తెచ్చిపెడుతుందో ఇక్కడ చూద్దాం.  

26
వృషభ రాశి

వృషభ రాశివారికి గురు ఉదయం మేలు చేస్తుంది. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడూ చూడనంత డబ్బు సంపాదిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు చకచక పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి.

36
సింహ రాశి

సింహ రాశి వారికి గురు ఉదయం శుభ ఫలితాలనిస్తుంది. సమాజంలో గుర్తింపు దక్కుతుంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. అందరితో సఖ్యతగా ఉంటారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. డబ్బుకు లోటుండదు.  

46
తుల రాశి

తుల రాశి వారికి గురు ఉదయం ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మీ పని, మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు.

56
మకర రాశి

మకర రాశి వారికి గురు ఉదయం వల్ల మేలు జరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అప్పుల బాధ తప్పుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.

66
మీన రాశి

మీన రాశివారికి గురు ఉదయం వల్ల అదృష్టం కలిసివస్తుంది. కొన్ని సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. చేపట్టిన పనుల్లో విజయం దక్కుతుంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.  

Read more Photos on
click me!

Recommended Stories