Moon Transit: తుల రాశిలోకి చంద్రుడు...ఈ ఐదు రాశులకు అదృష్ట యోగం..!

Published : Jul 04, 2025, 02:19 PM IST

ఈ చంద్రుని సంచారం 12 రాశుల జీవితాలపై ప్రతికూల, సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో చాలా మందికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి.

PREV
16
Moon transit

జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. కాగా, త్వరలోనే చంద్రుడు కూడా రాశిని మారనున్నాడు. జులై 31వ తేదీన శుక్రుడి గ్రహమైన తుల రాశిలోకి చంద్రుడు అడుగుపెట్టనున్నాడు. ఈ చంద్రుని సంచారం 12 రాశుల జీవితాలపై ప్రతికూల, సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో చాలా మందికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఐదు రాశులవారికి విజయ ద్వారాలు తెరుచుకున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

26
కర్కాటక రాశి..

చంద్రుడు.. తుల రాశిలోకి అడుగుపెట్టడం కర్కాటక రాశి వారికి చాలా మేలు జరగనుంది. శుక్రుడు, చంద్రుడు.. రెండూ ఈ రాశి వారికి చాలా మేలు చేయనున్నాయి. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఆదాయం చాలా ఎక్కువగా పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు అన్నీ పూర్తి అవుతాయి. ఆస్తి, భూమికి సంబంధించిన వివాదాలు ముగియనున్నాయి. మీర కొత్త వాహనం ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే, ఈ సమయం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటు నుంచి అయినా మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. మీరు విదేశాల్లో చదువుకునే అవకాశం పొందొచ్చు. మీ జీవిత భాగస్వామి నుంచి మీరు మంచి సపోర్ట్ లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ఈ సమయంలో మీ కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

36
తుల రాశి..

చంద్రుడి తుల రాశిలోకి అడుగుపెట్టడం.. తుల రాశివారికి అదృష్టాన్ని పెంచుతుంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు స్థానం ,ప్రతిష్టను సాధిస్తారు. మీకు పదోన్నతి లభిస్తుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. పోటీ పరీక్షలలో మీరు విజయం సాధిస్తారు. కార్యాలయంలో మీ లక్ష్యాలను సాధించడంలో మీరు విజయం సాధిస్తారు. దీని కోసం మీరు ప్రశంసలు అందుకుంటారు.

46
కుంభ రాశి:

అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమయంలో కళకు సంబంధించిన వ్యక్తులు మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. వారు ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు.

56
కన్య:

 ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందగలరు.మీరు అన్ని ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. స్నేహితులు , బంధువులతో సంబంధాలు బలపడతాయి. మీరు పని రంగంలో కూడా ప్రయోజనం పొందుతారు.

66
మిథునం:

దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయం విద్యార్థులకు వరంలా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోరిక నెరవేరుతుంది. కోరికలు కూడా నెరవేరుతాయి. విజయానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. పదోన్నతి లభించే అవకాశం ఉంది. జీతం పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టినా..మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories