2.సింహ రాశి..
సింహ రాశివారికి సాధారణంగా శత్రువులు అనేవాళ్లు ఉండరు. ఈ రాశివారికి సహజంగా ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. వీరిని వ్యతిరేకించి ఎదురు నిలపడటానికి ఎవరూ ధైర్యం చేయలేరు. ఎవరైనా వీరిని సవాలు చేస్తే.. వాళ్ల అంతం చూసేవరకు వీరు నిద్రపోరు. వీరు చాలా ప్రమాదకరం. ఈ రాశివారు తమ కుటుంబం, గౌరవం, స్నేహితుల కోసం..ఎవరితో అయినా పోరాటం చేయడానికి ఏ మాత్రం వెనక్కి తగ్గరు. అసలు.. వీరి గొంతుకి ఎలాంటివారైనా పారిపోవాల్సిందే.