Angarak Yog: ఈ ఏడాదిలో ఏర్పడనున్న ప్రత్యేక యోగాల్లో అంగారక యోగం ఒకటి. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు కుంభ రాశిలో కుజుడు (మంగళుడు), రాహువు కలిసి ఉండే కాలాన్ని అంగారక యోగంగా పరిగణిస్తారు. ఈ కాలం చాలా ప్రమాదకరమి జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కుజుడు శక్తి, ధైర్యం, వేగం సూచిస్తే, రాహువు అనిశ్చితి, గందరగోళానికి సూచికగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు అంగారక యోగం ఏర్పడుతుంది. 2026లో ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు ఈ యోగం కుంభ రాశిలో కొనసాగుతుంది. ముఖ్యంగా మార్చి 13–14 తేదీల సమయంలో శతభిష నక్షత్రంలో ఈ సంయోగం బలంగా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ సమయంలో నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం.
25
పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త
అంగారక యోగం సమయంలో ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం మంచిదిగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగం మార్చడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం, వివాహ నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు తరువాత ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంటుంది. కుజుడు, రాహువు ప్రభావం వల్ల ఆవేశంతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు రావచ్చు.
35
ప్రయాణాల్లో ప్రత్యేక జాగ్రత్తలు
మార్చి 9 నుంచి మార్చి 22 మధ్య కాలాన్ని కొంత ప్రమాదకరంగా భావిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు లేదా విమాన ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి అయితే ముందుగా పూర్తి ప్రణాళికతో వెళ్లాలి. చిన్న ప్రయాణాలు మాత్రమే చేయడం సురక్షితం అని చెబుతున్నారు. కుజుడు వాహనాలకు సూచికగా ఉండగా, రాహువు అనుకోని ఘటనలకు కారణమవుతాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఈ సమయంలో కుటుంబం లేదా కార్యాలయంలో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృశ్చికం, కుంభ రాశి వారు కోపాన్ని నియంత్రించుకోవాలి. అవసరం లేని వాదనలు చేయకుండా ఉండటం మంచిది. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. అపార్థాలు పెరగకుండా జాగ్రత్త పడాలి. మనసును ప్రశాంతంగా ఉంచేందుకు ధ్యానం, ప్రాణాయామం చేయడం మంచిది.
55
పెట్టుబడులు, ఖర్చుల్లో నియంత్రణ అవసరం
అంగారక యోగం సమయంలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా షేర్ మార్కెట్ పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీ పెట్టుబడులు, పెద్ద ఆస్తి కొనుగోలు వంటి వాటి విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఈ కాలంలో రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఏప్రిల్ 2 తర్వాత పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవడం మంచిదిగా భావిస్తున్నారు. ఆవేశంతో చేసే పనులు, గొడవలు లేదా ప్రతీకారం భావాలు దూరంగా ఉంచాలి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం లేదా ప్రార్థనలు చేయడం మనసుకు ప్రశాంతత ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, పలువురు పండితులు తెలిపిన విషయాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.