జోతిష్యశాస్త్రంలో శుక్రుడు సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యం, విలాసాలకు మూల కారణంగా పరిగణిస్తారు. అందువల్ల, శుక్రుని కదలికలో మార్పు వచ్చినప్పుడల్లా ఈ అంశాలు చాలా ఎక్కువగా ప్రభావితమౌతాయి. సంపదను ఇచ్చే శుక్రుడు ఫిబ్రవరిలో మకర రాశిలో ఉదయిస్తాడు. దీన వల్ల శుక్రుని పెరుగుదల ప్రభావం అన్ని రాశులను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అయితే... మూడు రాశుల జీవితం మాత్రం స్వర్ణమయం కానుంది. కెరీర్, వ్యాపారంలో పురోగతి సాధించగలరు. సంపద కూడా పెరుగుతుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం....