సింహ రాశి వారికి 2026 అదృష్ట కాలంగా చెప్పుకోవాలి. ఈ రాశి వారికి గురు, సూర్యులు సానుకూల స్థానంలో ఉండడం వల్ల ధనం విపరీతంగా కలిసివస్తుంది. ఎవరి దగ్గరైనా నిలిచిపోయిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారికి ఇంక్రిమెంట్లు, బోనస్ వంటివి దక్కే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారికి భారీ ఒప్పందాలు, ప్రాజెక్ట్ వంటివి ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఈ రాశివారికి లక్ష్మీదేవి ఆశీస్సులు నిండుగా ఉంటాయి. కాబట్టి మీ ఇల్లు ఆనందంతో నిండి పోయింది.