Zodiac Signs : జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల వారు తల్లిపై అపారమైన ప్రేమ ఉంటుంది. వీరికి తల్లి కంటే ఎవరూ ఎక్కువ కారు. వీరు తల్లికోసం ఎంతటి త్యాగమైనా చేస్తారు. వారు ఏ రాశులవారో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి రాశీ ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. తల్లి అంటే ప్రతి ఒక్కరికీ ప్రేమే. అయినప్పటికీ కొన్ని రాశులవారికి అమ్మపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు తల్లిపై ఎనలేని ప్రేమను, ఆప్యాయతను కలిగి ఉంటారు. వీరి తల్లికోసం ఏమైనా చేస్తారు. ఏ త్యాగమైనా చేస్తారు. ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
25
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారిని చంద్రుడు పాలిస్తారు. ఈ రాశివారికి కుటుంబ బంధాలు ఎక్కువ. వీరికి అమ్మ అంటే ప్రాణం. వీరు తమ తల్లిపై అనురాగాన్ని, ప్రేమను ఎక్కువగా చూపిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరికి తల్లికంటే ఏదీ ఎక్కువ కాదు. సంతోషమైనా, బాధైనా తల్లితోనే ముందుగా చెప్పుకుంటారు.
ఆప్తులు ఎంత మంది ఉన్నా తల్లికే ఎక్కువ విలువనిస్తారు. ఈ రాశి తల్లికి ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేరు. అమ్మ కోసం ప్రాణం ఇవ్వడానికైనా అస్సలు వెనకాడరు. ఈ రాశివారు తల్లితో లోతైన భావోద్వేగ సంబంధాన్ని కలిగుంటారు. తల్లి ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ వహించరు. వీరు తమ తల్లినే ఆదర్శంగా తీసుకుంటారు. వీరు తల్లికి, కుటుంబానికి దగ్గరగా ఉంటారు.
35
వృషభ రాశి
వృషభ రాశిని శుక్రుడు పాలిస్తాడు. ఈ రాశివారు విశ్వాసపాత్రులు. వీరికి కుటుంబం ముఖ్యంగా తల్లికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. తల్లికి ఆనందమైన జీవితాన్ని ఇవ్వడం వీళ్లకు వీళ్లకు ముఖ్యం. ఈ రాశివారు అమ్మకు ఉన్న ఏ చిన్న కోరికనైనా ఇట్టే తీరుస్తారు. తల్లిని దేవతలా కొలుస్తారు. వీరిక తల్లితో ఎమోషనల్ సంబంధం ఉంటుంది.
వీరు తల్లిపై ప్రేమను మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపిస్తారు. తల్లి అవసరాలను, ఆరోగ్య స్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అవసరమైతే తల్లికోసం ఏ త్యాగానికైనా వీరు సిద్ధపడతారు. వీరు తల్లిదండ్రుల మాటను అస్సలు జవదాటరు.
మీన రాశి వారు చాలా సున్నిత మనస్కులు. వీరికి అమ్మతో లోతైన అనుబంధం ఉంటుంది. వీరు తమ బాధలను అమ్మతో తప్ప ఎవ్వరితో చెప్పుకోరు. తల్లికి ఏదైనా సమస్య వస్తే ఆమెకు అండగా నిలిచి సమస్య లేకుండా చేస్తారు. అమ్మ సంతోషం కోసం వీరు ఏదైనా చేస్తారు.
వీరికి అమ్మతో ఎమోషనల్ బాండ్ బలంగా ఉంటుంది. తల్లి బాధ పడితే వీరు అస్సలు తట్టుకోలేరు. ఆమె బాధపడితే వీరి మనస్సు క్షోభిస్తుంది. వీరు అమ్మ మనసును అర్థం చేసుకుని ఆమెను సంతోషంగా ఉంచడానికి ఎంతో ప్రయత్నిస్తారు. వీరు తల్లిని దైవస్వరూపంగా భావిస్తారు. తల్లిని గౌరవించడం, ఆమె ప్రతి మాటను వినడం వీరి సహజ లక్షణం.
55
సింహ రాశి
సింహ రాశి వారు తమ తల్లిని ఒక రాణిలా చూసుకుంటారు. గౌరవిస్తారు. ఆమెకు మంచి జీవితం ఇవ్వడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తారు. తల్లి ఆత్మగౌరవానికి భంగం కలిగితే అస్సలు ఊరుకోరు. ఎంతకైనా తెగిస్తారు. సింహ రాశివారు గొప్పవారు కావడానికి తల్లే కారణమని వీరు బలంగా నమ్ముతారు. అందుకే వీరికి తల్లి అంటే ఎంతో ప్రేమ.
(నిరాకరణ: ఈ కథనంలోని సమాచారం జ్యోతిష్య అభిప్రాయాలు, మత గ్రంథాలు, పంచాంగంపై ఆధారపడింది. దీన్ని ఏషియానెట్ న్యూస్ ధృవీకరించలేదు. సమాచారాన్ని అందించడమే మా ఉద్దేశం. దీని కచ్చితత్వం, విశ్వసనీయతకు ఏషియానెట్ న్యూస్ బాధ్యత వహించదు)