సాధారణంగా ఒక వ్యక్తి పుట్టిన తేదీ, టైం లేదా చేతి గీతల ఆధారంగా వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు చెబుతుంటారు జ్యోతిష్య పండితులు. కానీ ఇవన్నీ లేని వారి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కూడా ఒక మార్గం ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ, టైం వారి భవిష్యత్తుపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. చేతిగీతలు, పుట్టిన తేదీ ఆధారంగా మన జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. కానీ పుట్టిన తేదీ, టైం లేనివాళ్ల పరిస్థితి ఏంటి? చేతి గీతలు సరిగ్గా లేనివారు కొందరుంటారు. మొత్తానికే చేతులు లేని వాళ్లు కూడా ఉంటారు. మరి ఇలాంటివారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఎలా తెలుస్తాయి? ఈ డౌట్ మీలో కూడా ఉందా? అయితే ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
చెవి ఆకృతిని బట్టి..
పూర్వం శరీర భాగాల ఆధారంగా వ్యక్తిత్వ విశ్లేషణ చేసేవారట. అందులో ముఖ్యమైనది చెవి. దీని ఆధారంగా జాతక విశ్లేషణ చేయవచ్చని పలువురు పండితులు చెబుతున్నారు. పుట్టిన తేదీ, సమయం లేకపోయినా చెవుల ఆకృతులను గమనించడం ద్వారా వ్యక్తి స్వభావం, భవిష్యత్తు, ఆయుష్షు వంటి అంశాలను అంచనా వేయవచ్చని వివరిస్తున్నారు.
36
పెద్ద చెవులు ఉంటే..
చెవుల ఆకారం, పరిమాణం, మడతలు, లోపలి నిర్మాణం వంటి ప్రతీ ఒక్కటి ఒక్కో సంకేతం. పెద్ద చెవులు కలిగినవారు చాలా తెలివైనవారు. జ్ఞానభ్యాసం పట్ల ఆసక్తి కలిగినవారు. బుద్ధుడు కూడా పెద్ద చెవులను కలిగి ఉండటం యాదృచ్ఛికం కాదని.. అది ఆయన గొప్ప జ్ఞానసంపత్తిని సూచిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, చిన్న చెవులు కలిగినవారు కొంచెం స్వార్థపరులు. తక్కువ ఓర్పు కలిగినవారని చెబుతున్నారు.
చెవులపై మడతలు ఎక్కువగా ఉంటే వారు గత జీవితాల్లో అనుభవాలు పొంది.. కొన్ని కర్మబంధనాలతో బాధపడే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు చెవి రంధ్రం పరిమాణం కూడా వ్యక్తిత్వం మీద ప్రభావం చూపుతుందట. చిన్న చెవి రంధ్రం కలిగినవారు కొంచెం రహస్య స్వభావం కలిగి ఉంటే.. పెద్ద చెవి రంధ్రం కలిగివారు చాలా ఓపెన్ గా ఉంటారట.
56
చెవిపై మచ్చలు ఉంటే..
జ్యోతిష్య పండితుల ప్రకారం ఒక వ్యక్తి చెవుల పరిమాణం, శబ్ధాన్ని గ్రహించే సామర్థ్యం, ఆకృతి వంటివి వారి వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. కొంతమంది చెవులపై ఉండే మచ్చలు వారి జీవితంలో ఎదురయ్యే కష్టాలను సూచించవచ్చు. దూదిలాంటి మెత్తటి చెవులు కలిగివారు చాలా సాఫ్ట్ గా, ఇతరుల పట్ల దయతో ఉంటారు.
66
పుట్టిన తేదీ, టైం లేనివారికి..
ఈ విధంగా చెవులను గమనించి ఆ వ్యక్తి గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి కొన్ని అంచనాలు వేసుకోవచ్చు. పుట్టిన సమయం తెలియనివారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన తేదీ, సమయం రికార్డు చేయని వాళ్లకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
గమనిక
ఈ సమాచారం పాఠకుల ఆసక్తిమేరకు జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించింది మాత్రమే.