ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?

First Published Dec 24, 2023, 11:10 AM IST


తెలంగాణలో అధికారం దక్కడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ  కేంద్రీకరించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం  ఆ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది.  

ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది.  కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా మాణిక్యం ఠాగూర్ కు బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ నాయకత్వం.  గతంలో తెలంగాణ కాంగ్రెస్ కు  మాణిక్యం ఠాగూర్ ఇంచార్జీగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 

also read:పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..

ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?

2024 ఏప్రిల్ మాసంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.  ఎన్నికల షెడ్యూల్  నిర్ణీత సమయం కంటే  15 నుండి 20 రోజుల ముందే వచ్చే అవకాశం ఉందని  ప్రచారం సాగుతుంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో  ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రులకు  చెప్పారు.

also read:ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?

2014లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించింది అప్పటి యూపీఏ సర్కార్.  రాష్ట్ర విభజనను  ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులు వ్యతిరేకించారు.  రాష్ట్ర విభజనకు కారణమైన  కాంగ్రెస్ పార్టీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికిలో లేకుండా పోయింది.  2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ, పార్లమెంట్ స్థానంలో కూడ విజయం సాధించలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో చేరారు.  కొందరు నేతలు  రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

also read:తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?


2024 ఏప్రిల్ లో జరిగే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు  కాంగ్రెస్ పార్టీ  ఇప్పటి నుండే కసరత్తును ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. దీంతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మెరుగైన సీట్లను దక్కించుకోవాలని ఆ పార్టీ వ్యూహలను రచిస్తుంది. 

also read:పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల  ఏర్పాటు చేసిన  వైఎస్ఆర్‌టీపీ పార్టీ కాంగ్రెస్ లో విలీనం  ప్రక్రియ నిలిచిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  వైఎస్ఆర్‌టీపీ  పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని  వై.ఎస్. షర్మిల మార్చుకున్నారు. 

also read:తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్‌టీపీ మద్దతు ప్రకటించింది. తెలంగాణలో కంటే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వై.ఎస్. షర్మిల సేవలను ఉపయోగించుకోవాలని  ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  బహిరంగంగానే  వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం వద్ద ఇదే విషయాన్ని  రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్ కు చెందిన తెలంగాణ నేతలు వై.ఎస్. షర్మిలకు మద్దతు ప్రకటించారు. 

also read:వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా  ఆ పార్టీ నాయకత్వం కార్యాచరణను సిద్దం చేస్తుంది.  గతంలో  పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన  ఎన్. రఘువీరా రెడ్డి  కాంగ్రెస్ లో  యాక్టివ్ అయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేసిన నేతలతో రఘువీరా రెడ్డి  టచ్ లోకి వెళ్లినట్టుగా ప్రచారం సాగుతుంది. 

also read:పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి

ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వై.ఎస్. షర్మిల సేవలను కాంగ్రెస్ నాయకత్వం  వినియోగించుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.   వై.ఎస్. షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా  ఆమె సేవలను  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినిగియోగించుకోవాలనే భావంతో  ఆ పార్టీ నాయకత్వం ఉందనే  ప్రచారం సాగుతుంది. 

also read:తెలంగాణలో 12 ఎంపీ స్థానాలపై బీజేపీ ఫోకస్:కాంగ్రెస్‌కు చెక్ పెట్టేనా?

ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో  175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో  వైఎస్ఆర్‌సీపీ కార్యాచరణను సిద్దం చేస్తుంది.   గెలిచే అవకాశం లేని  ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే  11 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలను మార్చారు. రానున్న రోజుల్లో మరిన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ఇంచార్జీలను మార్చనున్నారు. ఈ మేరకు  ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

also read:దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?

ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?

వైఎస్ఆర్‌సీపీ  పక్కన పెట్టిన  అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించి  బరిలోకి దింపాలని  కాంగ్రెస్ ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.అంతేకాదు  ఈ అభ్యర్థుల తరపున వై.ఎస్. షర్మిల ప్రచారం చేస్తారని  ప్రచారం సాగుతుంది.2024 జనవరిలో  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.  అయితే  ఈ విషయమై  వై.ఎస్. షర్మిల నుండి కానీ, కాంగ్రెస్ నాయకత్వం నుండి కానీ స్పష్టత రాలేదు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన వై.ఎస్. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  వేలు పెడతారా అనే విషయమై  చర్చ కూడ లేకపోలేదు.  

also read:1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?


వై.ఎస్. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెడితే  ఆ ప్రభావం  కన్పించే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సానుభూతిపరులు వై.ఎస్. షర్మిల వైపునకు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు  భావిస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీని దెబ్బతీసేందుకు  కాంగ్రెస్ ఈ మైండ్ గేమ్ ను ప్రారంభించిందా లేదా ఇదే కార్యాచరణను  హస్తం పార్టీ రానున్న రోజుల్లో అమలు చేయనుందా అనేది  భవిష్యత్తు తేల్చనుంది. 

also read:నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

click me!