ప్రతి నెలా వరల్డ్ బ్యాంక్, ADB బృందాలు అమరావతికి వచ్చి ప్రాజెక్ట్ పురోగతిని పరిశీలిస్తున్నాయి. వీరు CRDA అధికారులతో సమావేశాలు నిర్వహించి, నిర్మాణ ప్రదేశాలను సందర్శిస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన అప్‌డేట్‌లో.. “ప్రాజెక్ట్ పురోగతి సంతృప్తికరంగా ఉంది. పర్యావరణ, సామాజిక నిర్వహణ యూనిట్ ఏర్పాటు పూర్తయింది. నిర్మాణ కార్యకలాపాలు సక్రమంగా సాగుతున్నాయి,” అని తెలిపింది.
అమరావతి ప్రాజెక్టు అమలు చేస్తోంది ఎవరంటే.?
ఈ ప్రాజెక్ట్‌కు రుణం తీసుకుంటున్న సంస్థగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (Department of Economic Affairs) ఉంది. అమరావతి అభివృద్ధి బాధ్యత ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA)కి అప్పగించారు. వరల్డ్ బ్యాంక్‌లో భాగమైన ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (IBRD) ద్వారా ఈ రుణం మంజూరు అవుతుంది.