వాయుగుండంతో ఈ ప్రాంతాలకు భారీ వర్షగండం.. కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటుచేసే స్థాయిలో అల్లకల్లోలమా..!

Published : Oct 21, 2025, 04:42 PM IST

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు అంతకంతకు సంక్లిష్టంగా మారుతున్నాయి. కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుచేస్తున్నారంటేనే ఏ స్థాయిలో వర్షాల ముప్పు పొంచివుందో అర్థం చేసుకోవచ్చు.  

PREV
17
ఇకపై వర్షాలే వర్షాలు

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలను ఇప్పట్లో వర్షాలు వదిలిపెట్టేలా లేవు. వర్షాకాలం ముగిసి శీతాకాలం మొదలైనా... అక్టోబర్ ముగింపుకు చేరుకున్నా ఇంకా వర్షభయం కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ప్రస్తుతం అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి... ఇవి మెళ్లిగా జోరందుకోనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈవారం భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని... ఇందుకు తగ్గట్లుగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.

27
బంగాళాఖాతంలో అల్పపీడనం

ఇప్పటివరకు కొనసాగిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని APSDMA వెల్లడించింది. ఇది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందట ... మెళ్లిగా ముందుకు కదులుతూ మరింత బలపడుతుందని తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

37
మరో 36 గంటల్లో వాయుగుండం

అల్పపీడనం కాబోయే 36 గంటల్లొ అంటే బుధవారం సాయంత్రం లేదా రాత్రికి వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇలా అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డిఎంఏ ప్రకటించింది.

47
ఏపీ భారీ వర్షాలు... సహాయం కోసం ఫోన్ చేయాల్సిన టోల్ ఫ్రీ నెంబర్లు

భారీ వర్షసూచన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు, వరదలు, ఈదురుగాలలు, పిడుగుల వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది... కాబట్టి వర్ష సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ తో పాటు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలని సూచించింది. అత్యవసర సమయాల్లో ప్రజల సహాయం కోసం APSDMA కంట్రోల్ రూం ఏర్పాటుచేసింది... సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 కు కాల్ చేయాలని సూచించింది.

57
అల్లకల్లోలంగా సముద్రం

ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతాలకు సమీపంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నాయి... కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. కాబట్టి తీరప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని... సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు కూడా చేపలవేటకు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లినవారు వెంటనే తిరిగిరావాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

67
పిడుగుల ప్రమాదం కూడా...

ఈదురుగాలుతో పాటు పిడుగుల ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో ప్రజలు అస్సలు చెట్లకింద తలదాచుకోరాదని ఏపీ విపత్తు నిర్వహణ సూచించింది. అలాగే భారీ వర్షాలతో వరదలు సంభవిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తోంది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు.

77
తెలంగాణలో వర్షాలు

తెలంగాణ విషయానికి వస్తే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వర్ష సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories