జగన్ మోహన్ రెడ్డి ధరించిన షూలను ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తే అవి asics కంపెనీకి చెందినవిగా తేలింది. ఈ కంపెనీ రన్నింగ్ షూస్‌లను తయారు చేసే ప్రముఖ బ్రాండ్. ASICS కార్పొరేషన్ జపాన్‌కు చెందిన సంస్థ. ఇది క్రీడా పరికరాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందింది. Asics sneakers (రన్నింగ్ షూస్) కోసం ముఖ్యంగా గుర్తింపు పొందింది, కానీ ఈ కంపెనీ సాండల్స్ వంటి ఇతర పాదరక్షలు, అలాగే వస్త్రాలు (టి-షర్ట్స్, జాకెట్లు, హూడీస్, స్విమ్‌వేర్, కంప్రెషన్ గార్మెంట్స్, లెగింగ్స్, సాక్స్) తో పాటు బ్యాగ్స్, బ్యాక్‌ప్యాక్స్, క్యాప్స్ వంటివి కూడా తయారు చేస్తుంది. “Asics” పేరు లాటిన్ పదజాలం anima sana in corpore sano (అర్ధం: “సంతులిత మనస్సు, సౌకర్యవంతమైన శరీరం”) నుంచి రూపొందించారు. కంపెనీ ప్రధాన కార్యాలయం జపాన్‌లోని కోబే, హ్యోగో ప్రిఫెక్చర్‌లో ఉంది.