Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మంత్రులకు ఓ పిలుపునిచ్చారు. మంత్రులతో కీలక విషయాలు చర్చించి.. వాటిపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో తెలుసా
గత జగన్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు.. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై గణనీయంగా ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 24 గంటలు శ్రమిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పర్యటనలు చేస్తూ.. దిగ్గజ కంపెనీలు ఏపీవైపు చూసేలా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.
25
మరో పెద్ద సవాల్..
అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు మరో సవాల్ ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సృష్టిస్తోన్న ఫేక్ ప్రచారాలను తరిమికొట్టాలి. దానికోసం కేడర్ కలిసి పని చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలోనే వైసీపీ వర్గం వ్యాప్తి చేస్తోన్న ఫేక్ ప్రచారాలను బయటపెట్టాలని సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ మంత్రులకు స్పష్టంగా సూచించారు.
35
ప్రజలను అప్రమత్తం చేయాలి..
మంత్రులు వెంటనే దీనిపై దృష్టి సారించాలని.. పార్టీలోని కార్యకర్తలను కూడా ఈ అంశంపై అవగాహన కల్పించాలన్నారు. వైసీపీ చేసే ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టాలని సూచించారు. నకిలీ మద్యం, గూగుల్ డేటా సెంటర్, సంబంధిత కార్యకలాపాలకు సంబంధించి వైసీపీ చేస్తున్న తప్పుడు కథనాల గురించి ప్రజలకు తెలిసేలా చేయాలని.. టీడీపీ కార్యనిర్వాహక నాయకత్వానికి సూచించారు సీఎం చంద్రబాబు.
ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి.. కూటమి ప్రభుత్వాన్ని తక్కువ చేసేలా వైసీపీ ప్రయత్నిస్తోందని.. అబద్దాల కంటే నిజాలు ప్రజల్లోకి వెళ్ళేలా చేయాలని కేడర్‌కు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
55
జోగి రమేష్ అంశంపై..
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేయకపోవడంపై టీడీపీ సీనియర్ నాయకత్వం సీఎం చంద్రబాబును అడగగా.. ఈ కేసుపై సిట్ దర్యాప్తు జరుగుతోందని.. సరైన సమయంలో సాక్ష్యాలతో నిందుతులపై అధికారులు చర్యలు తీసుకుంటారని చంద్రబాబు అన్నారు. ఇక్కడ రాజకీయ ప్రతీకార చర్యలకు చోటు ఉండదని ఆయన స్పష్టం చేశారు.