దక్షిణాదిన ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులోని తీరప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో దేశ రాజధాని డిల్లీతో పాటు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి… దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండి.
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లోనూ చలిగాలులు, పొగమంచు తీవ్రత తగ్గింది.... ఇదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి. బంగాళాఖాతం నుండి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
25
నేడు ఏపీలో వర్షాలు
ఇక ఇవాళ, రేపు (శని, ఆదివారం) కూడా ఏపీలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తీరప్రాంతాల్లో గాలుల వేగం ఎక్కువగా ఉంటుందని... అక్కడక్కడా వర్షం కురుస్తుందని హెచ్చరిస్తోంది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయి... కాబట్టి రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
35
ఓవైపు చలి... మరోవైపు వాన
ఓవైపు వర్షాలు, మేఘావృత వాతావరణం ఉండగా మరోవైపు చలి, పొగమంచు వెదర్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చలి తగ్గినా ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఇరగదీస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తుంటే ఉత్తరకోస్తాలో పొగమంచు కురుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కరకంగా వాతావరణం ఉంది.
తెలంగాణ విషయానికి వస్తే చలి బాగా తగ్గింది... కానీ దట్టమైన పొగమంచు కొనసాగుతోంది. ప్రస్తుతం కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... మిగతా అన్ని జిల్లాల్లోనూ 15 కంటే ఎక్కువగానే లోయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. నిన్న(శుక్రవారం) అత్యల్పంగా మెదక్ లో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది... ఇక హైదరాబాద్ లో హయత్ నగర్ లో 15 డిగ్రీల అత్యల్ప టెంపరేచర్ నమోదయ్యింది.
55
ఉత్తరాదిన వర్షాలు
ఇక తమిళనాడుతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని డిల్లీలో నిన్న(శుక్రవారం) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇవాళ(శనివారం) కూడా వర్షాల కొనసాగే అవకాశాలు ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ వర్షాల కారణంగా గాలిలో తేమ పెరిగి కాలుష్యం తీవ్రత బాగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. Western Disturbance) పశ్చిమ కల్లోలం కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది.