Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు

Published : Jan 23, 2026, 10:04 AM IST

Tirupati: తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న భ‌క్తులు తిరుప‌తికి స‌మీపంలో ఉన్న ప‌రిస‌ర ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తుంటారు. అయితే స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో ఇబ్బందులు ప‌డుతుంటారు. అలాంటి వారి కోసం ఏపీ టూరిజం శాఖ ఒక మంచి ప్యాకేజీని తీసుకొచ్చింది. 

PREV
15
తిరుమల యాత్రికులకు గుడ్ న్యూస్

దేశం నలుమూలల నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులు, తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధ ఆలయాలను ఒక్క రోజులో దర్శించాలనుకుంటుంటారు. అయితే ఏయే ప్రదేశాలు చూడాలి, ఎలా వెళ్లాలి అనే స్పష్టత చాలామందికి ఉండదు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ, టీటీడీ కలిసి ప్రత్యేక ప్యాకేజీ ఆలయ పర్యటనలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

25
ప్యాకేజీ టూర్‌లతో కలిగే లాభాలు

ఈ ప్రత్యేక టూర్‌లలో ఆలయ దర్శన సమయాలు ముందే ఖరారు చేస్తారు. భక్తులు ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఆలయాల ప్రాముఖ్యత, చరిత్ర వివరించేందుకు అనుభవజ్ఞులైన గైడ్‌లు అందుబాటులో ఉంటారు. తక్కువ ఖర్చుతో అనేక ప్రముఖ ఆలయాలను ఒకే రోజులో దర్శించే అవకాశం లభిస్తుంది. ఒకవేళ పెద్ద సంఖ్యలో భక్తులు ఉంటే, ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేస్తారు. కోరుకున్న ప్రాంతం నుంచి సేవలు అందిస్తారు. 

35
తిరుపతి పరిసర ప్రాంతాల ఆలయ దర్శన ప్యాకేజీ

ఈ ప్యాకేజీ ద్వారా కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి ఆలయం, నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, నగరిలోని శ్రీ కరియ మాణిక్య స్వామి ఆలయం, బుగ్గలోని అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయం, సురుటుపల్లెలోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయాలను దర్శించి తిరుపతికి చేరుకుంటారు.

బస్సుల సమయం: ఉదయం 8.30 నుంచి 9.30 వరకు

టికెట్ ధర: ఒక్కరికి రూ.550

45
తిరుపతి నగర పరిధిలోని స్థానిక ఆలయాలు

తిరుపతి పరిధిలో ఉన్న ప్రముఖ ఆలయాలను ప్రత్యేకంగా ఈ ప్యాకేజీలో చేర్చారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తొండవాడ ఆగస్తీశ్వర స్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం, కపిలేశ్వర స్వామి ఆలయం, వకుళామాత ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం వద్ద బస్సు నుంచి భక్తులను దింపుతారు.

బస్సుల సమయం: ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు

టికెట్ ధర: ఒక్కరికి రూ.250

55
ప్రత్యేక టూర్‌లు, బస్సుల లభ్యత వివరాలు

స్థానిక ఆలయాల ప్యాకేజీతో పాటు శ్రీకాళహస్తి దర్శనానికి రూ.450, కాణిపాకం ఆలయానికి రూ.550 వసూలు చేస్తారు. తిరువణ్ణామలై, వేలూరు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం ఆలయాలను ఏసీ బస్సులో దర్శించాలంటే ఒక్కరికి రూ.1200 చెల్లించాలి.

శ్రీకాళహస్తి టూర్‌లో తిరుపతి నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి తిరుచానూరు, వికృతమాలలోని సంతాన సంపద వేంకటేశ్వర స్వామి ఆలయం, గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయం, తొండమనాడులోని వేంకటేశ్వర స్వామి ఆలయం, కపిలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తారు.

నాన్ ఏసీ బస్ టికెట్: ఒక్కరికి రూ.450

ఈ బస్సులు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయాల్లో అందుబాటులో ఉంటాయి. అక్కడ ఉన్న పర్యాటకశాఖ సమాచార, రిజర్వేషన్ కార్యాలయాల్లో పూర్తి వివరాలు పొందవచ్చు. పూర్తి వివ‌రాల కోసం 9848007033, 0877 – 2289123 నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories