Weather Update : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు చలి ఉంటుంది, ఎప్పుడు ఎండలు కాస్తాయి, ఎప్పుడు వర్షం కురుస్తుందో అర్థంకాని పరిస్థితి ప్రస్తుతం ఉంది.
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు కొనసాగుతున్నాయి... ఇక మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మొదలయ్యాయి. ఇదే సమయంలో అరేబియా సముద్రంలో అల్పపీడనం... ద్రోణి వాతావరణం ఎఫెక్ట్ తో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో ఒకేసారి చలి, ఎండా, వాన పరిస్థితులు ఉన్నాయి.
25
ఏపీని కమ్మేయనున్న మేఘాలు
అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని... ఇది కేరళ తీరానికి సమీపంలో ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తాయని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఉత్తరాది నుండి వస్తున్న భారీ మేఘాల కారణంగా ద్రోణి వాతావరణం ఏర్పడిందని... దీంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ద్రోణి ప్రభావంతో వర్షాలు పడకున్నా ఆకాశం మేఘాలతో కప్పేసి ఉంటుందట.
35
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చలి
ఇదిలావుంటే గత కొన్నిరోజులుగా తెలుగు ప్రజలను వణికించిన చలి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా శీతాకాలం ఎండింగ్ లో ఉండే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... అంటే అటు పూర్తి చలిగా కాదు... ఇటు పూర్తి వేడిగా కాదు... మధ్యస్థంగా వాతావరణం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జనవరి 30 నుండి ఫిబ్రవరి 6 వరకు అత్యల్పంగా 17-19 డిగ్రీలు... అత్యధికంగా 31-32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు.
తెలంగాణ విషయానికి వస్తే మరికొద్దిరోజులు పొడి వాతావరణం కొనసాగుతుందట. ప్రస్తుతం అత్యల్పంగా 15.7 డిగ్రీలు, అత్యధికంగా 32.3 డిగ్రీల ఉష్ణోగ్రత ఆదిలాబాద్ లోనే నమోదయ్యాయి. మెదక్ లో 16, రామగుండంలో 17.5, హన్మకొండలో 18, నల్గొండలో 18.4, మహబూబ్ నగర్ లో 18.6, నిజామాబాద్ లో 18.7, భద్రాచలంలో 20 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదవుతున్నాయి.
55
హైదరాబాద్ వాతావరణం
అయితే హైదరాబాద్ లో ఇప్పటికీ కొన్నిప్రాంతాల్లో చలి కొనసాగుతోంది. పటాన్ చెరులో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఇక హయత్ నగర్ లో 16, రాజేంద్ర నగర్ లో 16.5, హకీంపేటలో 17.6, బేగంపేటలో 19.1, దుండిగల్ లో 18 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అత్యధికంగా హకీంపేటలో 31.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.