Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇంతకాలం చలి ఇరగదీయగా ఇప్పుడు వర్షాలు, ఎండలు కూడా తోడవుతున్నాయి. కొన్నిచోట్ల వర్షాలుంటే మరికొన్నిచోట్ల ఎండలు మండిపోతున్నాయి.
IMD Rain Alert : వర్షకాలం ముగిసింది... శీతాకాలం కూడా ముగిసి వేసవి రాబోతోంది. కానీ కాలంతో పనిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాలు ఈ వర్షాలకు కారణం అవుతున్నాయి... ఒక్కోసారి తుపానులు ఏర్పడి అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. తాజాగా అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ఎఫెక్ట్ తో వర్షాలు మొదలయ్యాయి.
25
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
కేరళ సమీపంలో ఈ అల్పపీడనం కొనసాగుతోంది... ఇది క్రమక్రమంగా తీరంవైపు పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం కేరళ, తమిళనాడుపై ఎక్కువగా ఉంటుందని... ఆంధ్ర ప్రదేశ్ పై స్వల్పంగా ఉంటుందని వెల్లడించింది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూల్ జల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
35
తీరప్రాంతాల ప్రజలకు హెచ్చరిక..
తీరప్రాంతాలపై ఈ అల్పపీడనం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని... గాలుల వేగం పెరిగి అలలు ఎగిసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్య్సకారులు వేటకు వెళ్లరాదని.. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
ఇలా ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలతో పాటు చలి, పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక పగటిపూట అప్పుడే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఎండలు మండిపోతున్నాయి. ఇలా రాష్ట్రంలో ఒకేసారి వాన, చలి, ఎండ తో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగులతో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇదే సమయంలో నందిగామ వంటి ప్రాంతాల్లో 33-34 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి.
55
తెలంగాణ వాతావరణం
తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుతం శీతాకాలం నుండి వేసవి కాలానికి వెదర్ చేంజ్ అవుతోంది. కొంతకాలంగా అత్యల్పంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మెళ్ళిగా పెరుగుతున్నాయి... ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15 డిగ్రీలకు పైగానే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్నాయి. పగటిపూట అత్యధికంగా 32-33 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. నిన్న(జనవరి 29న) హైదరాబాద్ లో అత్యల్పంగా పటాన్ చెరులో 14.4 డిగ్రీలు, అత్యధికంగా హకీంపేటలో 31.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.